జింక కోసం మాటువేసిన పులి.. నెమ‌లి ఎంట్రీతో బెడిసికొట్టిన పులి ప్లాన్‌

Updated on: Oct 05, 2026 | 5:00 PM

అడవిలో పులి దాడి నుంచి ఓ జింక అనూహ్యంగా తప్పించుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చెరువు వద్ద నీరు తాగేందుకు వచ్చిన జింకను చెట్టు చాటున మాటువేసిన పులి వేటాడేందుకు సిద్ధమైంది. సరిగ్గా దాడికి కొన్ని క్షణాల ముందు అక్కడికి వచ్చిన నెమలి గట్టిగా అరవడంతో జింక అప్రమత్తమై పరుగులు తీసింది. పులి వెంబడించినా, జింక పొదల్లోకి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది.

ప్రకృతిలో వన్యప్రాణుల మనుగడ నిరంతరం ఒక జీవన పోరాటమే. ఆహారం కోసం క్రూర మృగాలు వేటాడితే.. ప్రాణాలు దక్కించుకోవడానికి సాధు జంతువులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండక తప్పదు. అయితే, మృత్యువు ముంగిట ఉన్న జీవికి ప్రాణాపాయం నుంచి తప్పించుకునే మార్గం ఏదొక రూపంలో దొరుకుతుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అడవిలో ఒక జింక దాహం తీర్చుకోవడానికి చెరువు వద్దకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో అక్కడ మాటు వేసిన ఒక పులి తన చాకచక్యంతో జింకను వేటాడి తినాలని ప్లాన్ వేసింది. జింకకు ఏమాత్రం అనుమానం రాకుండా చెట్టు చాటున సైలెంట్‌గా నిల్చొని, దానిపై ఒక్కసారిగా దాడి చేసేందుకు సిద్ధమైంది. మరికొన్ని క్షణాల్లో పులి జింకను హతమార్చేదే. కానీ, ఆ జింకకు ఇంకా భూమి మీద నూకలు మిగిలి ఉన్నాయి. ఊహించని విధంగా అక్కడకు వచ్చిన ఒక ‘అతిథి’ ఆ జింక ప్రాణాలను కాపాడింది. ఆ అనుకోని అతిథి మరెవరో కాదు.. ఒక నెమలి! సరిగ్గా జింకపై పులి దాడి చేయబోయే కొన్ని సెకన్ల ముందు నెమలి గట్టిగా అరిచింది. ఆ అరుపులు విన్న వెంటనే అప్రమత్తమైన జింక, తన వెనుక ఏదో ప్రమాదం పొంచి ఉందని గ్రహించి ఒక్కసారిగా చెంగుచెంగున పరుగులు తీసింది. జింకను పట్టుకునేందుకు పులి వెనుకాలే పరుగెత్తినా ప్రయోజనం లేకుండా పోయింది. జింక క్షణాల్లో పొదల్లోకి పారిపోయి మాయమైపోయింది. అలా తన ప్రాణాలను కాపాడుకుంది. సమయానికి నెమలి చేసిన హెచ్చరికతో జింక బ్రతికిపోవడంతో, ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

BSNL: బీఎస్‌ఎన్‌‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే 24 రోజులు ఉచిత కాల్స్

Loading...
Unable to load recommendations.
Follow Us