Dog Sleeping in Bus: బ‌స్సులో కుక్కకు గౌర‌వం.. ప్రయాణికుల‌కు సెల్యూట్‌.. వైరల్ వీడియో..

|

Oct 16, 2022 | 9:17 AM

బ‌స్సులోకి కుక్క ఎక్కింద‌నుకో.. మ‌నం ఏం చేస్తాం. దాన్ని బ‌స్సు నుంచి త‌రిమేస్తాం. ఒక వేళ ఆ కుక్క దిగ‌క‌పోతే దాడి చేసేందుకు సైతం వెనుకాడం. కానీ ఆ ప్రయాణికులు మాత్రం ఓ శునకాన్ని గౌర‌వించారు.


బ‌స్సులోకి కుక్క ఎక్కింద‌నుకో.. మ‌నం ఏం చేస్తాం. దాన్ని బ‌స్సు నుంచి త‌రిమేస్తాం. ఒక వేళ ఆ కుక్క దిగ‌క‌పోతే దాడి చేసేందుకు సైతం వెనుకాడం. కానీ ఆ ప్రయాణికులు మాత్రం ఓ శునకాన్ని గౌర‌వించారు. బ‌స్సులోకి ఎక్కిన కుక్కను త‌రిమేయ‌లేదు. ఆ శున‌కం ఓ రెండు సీట్లను ఆక్రమించుకున్నప్పటికీ.. దానికి ఏ మాత్రం హానీ క‌లిగించ‌లేదు. సీట్లో హాయిగా నిద్రిస్తున్న కుక్కకు ప్రయాణికులు ఏ మాత్రం ఆటంకం క‌లిగించ‌లేదు. తోటి మ‌నిషిలా ఆ శున‌కాన్ని గౌర‌వించిన ప్రయాణికులు.. నెటిజ‌న్ల హృద‌యాల‌ను గెలుచుకున్నారు. బ‌స్సంతా ప్రయాణికుల‌తో కిక్కిరిసిపోయింది. నిల‌బ‌డ‌టానికి కూడా స్థలం లేదు. అలాంటి బ‌స్సులో ఓ శున‌కం రెండు సీట్లలో హాయిగా ప‌డుకుని ప్రయాణించింది. దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి త‌న సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. కుక్కను గౌర‌వించిన ప్ర‌యాణికుల‌కు నెటిజ‌న్లు సెల్యూట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Published on: Oct 16, 2022 09:17 AM