గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఉండగా చూసిన పేరెంట్స్‌ ఆ తర్వాత ఏమైంది అంటే ??

Updated on: May 08, 2025 | 7:34 PM

ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి ఉన్న సమయంలో పేరెంట్స్‌ చూశారు. వెంటనే ప్రియురాలితో కలిసి స్కూటర్‌పై పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇంతలో తల్లిదండ్రులు స్థానికులతో కలిసి వారిని అడ్డుకున్నారు. కుమారుడితోపాటు అతడి ప్రియురాలికి దేహశుద్ది చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల రోహిత్, 19 ఏళ్ల ప్రియురాలు కలిసి ఫుడ్‌ స్టాల్‌ వద్ద చౌమీన్‌ తిన్నారు. ఇంతలో రోహిత్‌ తల్లిదండ్రులు సుశీల, శివకరణ్ అక్కడకు చేరుకున్నారు. ప్రియురాలితో కలిసి ఉన్న కుమారుడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ప్రియురాలితో కలిసి స్కూటర్‌పై అక్కడి నుంచి పారిపోయేందుకు రోహిత్‌ ప్రయత్నించాడు. అయితే తల్లిదండ్రులు అతడి స్కూటర్‌ను అడ్డుకున్నారు. కుమారుడ్ని, అతడి ప్రియురాలిని నిలదీయడంతోపాటు చెప్పుతో కొట్టారు. వారిద్దరి జుట్టుపట్టుకుని తన్నారు. అక్కడ గుమిగూడిన జనం జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా వారిద్దరిని కొట్టడం మాత్రం ఆపలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: కర్ణుడిగా ప్రభాస్‌.. అర్జునుడిగా హృతిక్! సీక్రెట్‌గా ముగిసిన మహాభారతం సినిమా!

ఆ ఊర్లో పెళ్లి లేదు.. కానీ ఊరంతా పందిళ్లు.. ఎందుకంటే ??

ఆపరేషన్ సింధూర్‌ !! భారత ఆర్మీకి జేజేలు కొట్టిన మన హీరోలు

ఏంది మామా ఇది !! షారుఖ్ వాచ్ ఖరీదు అక్షరాల రూ.21 కోట్లా ??

నమ్మి లొంగిపోతే.. వీడియో తీసి లీక్ చేశాడు !! లవర్‌ నిర్వాకంతో.. హీరోయిన్ గాయబ్‌ !!