దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
బీచ్‌లో రీల్స్ తీసుకుంటున్న తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి సముద్రపు అలల మధ్య చిక్కుకున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాప నీటిలో కొట్టుకుపోతుండటాన్ని గమనించిన ఓ యువకుడు వెంటనే సముద్రంలోకి దూకి చిన్నారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. ఈ ఘటనపై నెటిజన్లు తల్లిదండ్రుల తీరుపై విమర్శలు చేస్తుండగా, చిన్నారిని కాపాడిన యువకుడి ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియా రీల్స్ పిచ్చి మనుషులను ఎంతలా మైమరిపిస్తోందో చెప్పే మరో దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. బీచ్‌లో రీల్స్ చేయడంలో నిమగ్నమైన తల్లిదండ్రులు కన్నబిడ్డను గాలికి వదిలేసారు. ఆ పసిపాప అలల్లో కొట్టుకుపోతుంటే.. ఓ యువకుడు గమనించి తన ప్రాణాలకు తెగించి బిడ్డను కాపాడాడు. వివరాల ప్రకారం, ఓ దంపతులు బీచ్‌లో సెల్ఫీ స్టిక్ సహాయంతో రీల్స్ షూట్ చేయడంలో మునిగిపోయారు. అదే సమయంలో వారి చిన్నారి సముద్రపు అలల సమీపంలో ఒంటరిగా ఆడుకుంటూ నీటిలోకి వెళ్లిపోయింది. అలల తాకిడి పెరుగుతున్నా కనీసం కన్నతల్లిదండ్రులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సముద్రపు ఉధృతికి పాప నీటిలో కొట్టుకుపోతుండగా.. అక్కడే ఉన్న ఓ యువకుడు ఈ ప్రమాదాన్ని గమనించాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకి, పాపను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో పెను విషాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా పిచ్చిలో పడి పిల్లల ప్రాణాలనే పణంగా పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఆపదలో ఉన్న పసిపాపను కాపాడిన యువకుడి సమయస్ఫూర్తిని, సాహసాన్ని అందరూ అభినందిస్తున్నారు. సోషల్ మీడియా మోజు ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో ఈ ఘటన అద్దం పడుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏనుగులకు స్పెషల్ డైట్.. మైసూర్ దసరా జంబూ సవారీ వెనుక అసలు రహస్యం ఇదే
రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్ ఇక..నెలనెలా మరో 6 సరుకులు! త్వరలోనే అధికారిక ప్రకటన.!
డబ్బుల్లేవని వైద్యం ఆపకండి.. హాస్పిటల్ బిల్లులకూ ఈఎంఐ ఆప్షన్.. అసలు నిజమిదే!