థమ్స్‌అప్‌తో పానీపూరీ చేస్తున్న వీధివ్యాపారి.. టేస్ట్ అదిరింది అంటున్న నెటిజన్లు
సాధారణంగా స్ట్రీట్ ఫుడ్స్‌లో పానీ పూరీ అంటే ఇష్టపడని వారుండరు. పానీపూరీ బండి కనిపించిందంటే చాలు నోరూరుతుంది చాలామందికి. ఎంత వద్దనుకున్నా అటువైపు లాక్కెళ్తుంది మనసు.
సాధారణంగా స్ట్రీట్ ఫుడ్స్‌లో పానీ పూరీ అంటే ఇష్టపడని వారుండరు. పానీపూరీ బండి కనిపించిందంటే చాలు నోరూరుతుంది చాలామందికి. ఎంత వద్దనుకున్నా అటువైపు లాక్కెళ్తుంది మనసు. ఇలాంటి వారిని మరింత ఆకర్షించడం కోసం వీధివ్యాపారులు రకరకాల వెరైటీలలో చాట్ తయారుచేస్తున్నారు. ఫాంటా నూడుల్స్, ఐస్‌క్రీమ్ పానీపూరీ, ఐస్‌క్రీమ్ సమోసా, ఇప్పుడు తాజాగా థమ్స్ అప్ పానీపూరీ వచ్చింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌మీడియాలో నెటిజన్లను ఊరిస్తోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వద్ద ఓ వ్యక్తి పానీ పూరీ తయారు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఒక గిన్నెలో థమ్స్ అప్ వేశాడు. అందులో చాట్ మసాలా, ఉల్లిపాయముక్కలు వేశాడు. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి అందులో పానీపూరీలను ముంచి కస్టమర్స్‌కి అందిస్తున్నాడు. అది తిని రుచి చూసిన ఓ మహిళ సూపర్ అంటూ అతనికి మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జై కొట్టిన 16వేల మంది.. వరల్డ్ బిగ్ స్క్రీన్ పై RRR
Allu Arjun: తెలుగోడి సత్తా.. సౌత్ ఇండియా మొత్తంలో ఒకే ఒక్క హీరో అల్లు అర్జున్
Salaar: రిలీజ్ కాకముందే డార్లింగ్ దిమ్మతిరిగే రికార్డ్ !!
Jr NTR: దిగివచ్చిన HCA !! తారక్ కోసం స్పెషల్ అవార్డ్ !!