Nurse vs Doctor: రేప్ చెయ్యడానికొచ్చిన డాక్టర్‌.. ప్రైవేట్ పార్టులను కోసేసిన నర్స్.!

|

Sep 16, 2024 | 10:16 AM

బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది. అయితే బాధితురాలు చాకచాక్యంగా వ్యవహరించి ఘటన నుంచి తప్పించుకుంది. అక్కడే తాను పనిచేస్తున్న క్లినిక్​లో ఉన్న బ్లేడ్​తో డాక్టర్ జననాంగాలను కోసేసింది. ఘటనాస్థలి నుంచి బయటకొచ్చి పోలీసులకు సమాచారం అందించింది. సమస్తిపుర్‌ జిల్లాలోని ముస్రీగరారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్‌బీఎస్‌ హెల్త్‌కేర్‌..

బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది. అయితే బాధితురాలు చాకచాక్యంగా వ్యవహరించి ఘటన నుంచి తప్పించుకుంది. అక్కడే తాను పనిచేస్తున్న క్లినిక్​లో ఉన్న బ్లేడ్​తో డాక్టర్ జననాంగాలను కోసేసింది. ఘటనాస్థలి నుంచి బయటకొచ్చి పోలీసులకు సమాచారం అందించింది. సమస్తిపుర్‌ జిల్లాలోని ముస్రీగరారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్‌బీఎస్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. బాధితురాలు బుధవారం రాత్రి విధుల్లో నిమగ్నమై ఉంది. ఆ సమయంలో డాక్టర్‌, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌ అయిన సంజయ్‌ కుమార్‌ మరో ఇద్దరు సహాయకులతో కలిసి ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. అయితే వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ నర్సు పదునైన బ్లేడ్‌తో డాక్టర్‌ జననాంగాలను కోసేసింది. అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చి పోలీసులకు కాల్ చేసింది. ఘటన జరిగిన సమయంలో డాక్టర్‌, ఇతర నిందితులు మద్యం మత్తులో ఉన్నారని తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌తో పాటు మిగతా ఇద్దరిని అరెస్టు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.