Viral video: అద్భుతమైన ట్యాలెంట్‌తో అదరగొడుతున్న చిన్నారి.. 38 సెకన్లలో 75 జిల్లాల పేర్లు.. వైరల్ వీడియో..
టీవల కొందరు చిన్నారులు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కష్టసాధ్యమైన పనులు చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన
టీవల కొందరు చిన్నారులు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కష్టసాధ్యమైన పనులు చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక 38 సెకెన్లలో రాష్ట్రంలోని 75 జిల్లాల పేర్లను చకచకా చెప్పేసింది. అది కూడా అక్షరక్రమంలో. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. చిన్నారి ట్యాలెంట్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో అంటూ సామెతలను గుర్తు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. యూపీలోని దియోరియా జిల్లాకు చెందిన ఈ బాలిక మాన్వి చౌరాసియా ఆదర్శ్ ప్రాథమిక విద్యాలయ పాఠశాలలో చదువుతోంది. ఈ చిన్నారి ట్యాలెంట్‌కు సంబంధించిన వీడియోను శుభాంకర్ మిశ్రా అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘అమేజింగ్ గర్ల్. ఈ బాలిక నైపుణ్యానికి మీరు కూడా సెల్యూట్ చేస్తారు’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోచూసి ఫిదా అయిపోతున్న వేలాదిమంది నెటిజన్లు లైక్స్‌తో రీ ట్వీట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘బాలికకు మంచి భవిష్యత్ ఉంది’, ‘ఇంటెలిజెంట్ గర్ల్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
