AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: చిన్నారి శరీరంపై రాముడు, రాధ పేర్లు.. వాటికవే పుట్టుకొచ్చాయంటున్న స్థానికులు.

Viral: చిన్నారి శరీరంపై రాముడు, రాధ పేర్లు.. వాటికవే పుట్టుకొచ్చాయంటున్న స్థానికులు.

Anil kumar poka
|

Updated on: Nov 08, 2023 | 8:18 PM

Share

ఆధునిక కాలంలో కూడా సైన్స్ కు, వైద్యులకు సవాల్ విసురుతూ తరచుగా వింత ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలిక శరీరంపై రాధే-రాధే, రామ్-రామ్ అనే పదాలు వాటికవే పుట్టుకొస్తున్నాయి. మొదట శరీరంపై గీతల్లా కనిపించినా రాను రాను అవి రాధే.. రాధే, రామ్..రామ్ రూపాలు సంతరించుకుంటున్నాయి.

ఆధునిక కాలంలో కూడా సైన్స్ కు, వైద్యులకు సవాల్ విసురుతూ తరచుగా వింత ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలిక శరీరంపై రాధే-రాధే, రామ్-రామ్ అనే పదాలు వాటికవే పుట్టుకొస్తున్నాయి. మొదట శరీరంపై గీతల్లా కనిపించినా రాను రాను అవి రాధే.. రాధే, రామ్..రామ్ రూపాలు సంతరించుకుంటున్నాయి. ఇది చూసి బాలిక కుటుంబ సభ్యులే కాదు వైద్యులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు. కొందరు దీన్ని అద్భుతం అని.. మరికొందరు దైవానుగ్రహం అని అంటున్నారు. అయితే దేవుడిని పూజించడం అంటే చిన్నారి బాలికకు చాలా ఇష్టం అని బాలిక తండ్రి చెప్పాడు. అందుకే ఇలా జరుగుతోందని అంటున్నారు. హర్దోయ్‌లోని మధోగంజ్ బ్లాక్‌లోని సహిజన్ గ్రామం ఈ ఘటనకు వేదికగా నిలిచింది. స్థానికంగా ఉంటున్న దేవేంద్ర అనే రైతు కుమార్తె ఎనిమిదేళ్ల సాక్షి శరీరంపై గత 20 రోజులుగా దైవ నామాల రూపంలో గీతలొస్తున్నాయి. హిందీ భాషలో కనిపిస్తున్న ఈ పేర్లు బాలిక శరీరంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది చూసిన కుటుంబ సభ్యులు మొదట్లో పట్టించుకోలేదు. తర్వాత గుర్తించి బాలికను ఆస్పత్రికి తరలించారు. ఇది చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. అయితే బాలిక సమస్యకు పరిష్కారం వైద్యులు కూడా చూపలేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య శాస్త్రంలో ఇప్పటి వరకూ ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవని వైద్యులు చెబుతున్నారని స్థానిక మీడియా పేర్కొంటోంది. ప్రస్తుతం సాక్షి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాక్షి శరీరంపై హిందూ దేవుళ్లు , దేవతల పేర్లు హిందిలో కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు తన కూతురు పరిస్థితిపై రైతు దేవేంద్ర ఆందోళన వ్యకం చేస్తున్నారు. ఈ ఘటనపై బాలిక పాఠశాల సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు, తన మనవరాలకి దైవం అంటే భయం, భక్తి అన్నీ ఉన్నాయని.. పూజ బాగా చేస్తుందని సాక్షి తాత శివబాలక్ చెప్పారు. తమ కుటుంబం మొత్తం దైవ భక్తులేనని, అందుకే తన మనవరాలు శరీరంపై ఇలాంటి అద్భుతాలు జరగడం దైవానుగ్రహమేనని, తనకు రామయ్య ఆశీర్వాదం లభించిందని చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.