అర్ధరాత్రి వీధుల్లో యువకులు.. దేనికో తెలుసా!

Updated on: Jul 12, 2026 | 6:25 PM

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు వరుసగా వీధిలైట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుండటంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. రాత్రిపూట చీకటిని ఆసరాగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందనే అనుమానంతో యువకులు గుంపులుగా ఏర్పడి గస్తీ కాస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఒక విచిత్రమైన సమస్య కాలనీవాసులకు కంటికి నిద్రలేకుండా చేస్తోంది. అర్ధరాత్రి వేళల్లో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాలనీకి సంబంధించిన వీధి లైట్ల విద్యుత్ సరఫరాను కట్ చేస్తూ అంధకారంలోకి నెడుతున్నారు. నేలకొండపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో గత కొద్ది రోజులుగా వ్యవహారం కంటిన్యూగా సాగుతోంది. రాత్రి కాగానే కాలనీలో వీధిలైట్లన్నీ ఆగిపోయి.. మొత్తం చీకటిమయం అవుతోంది. ఎవరైనా వెళ్లి వీధి లైట్ల ఎంసీబీ ని ఆన్ చేసినప్పటికీ.. కాసేపటికే ఆ అపరిచితులు మళ్లీ వచ్చి కనెక్షన్ ఆఫ్ చేస్తుండడంతో కాలనీవాసులు విసిగిపోయారు. దాంతో ఆ వింత వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని కాలనీ యువత స్వయంగా రంగంలోకి దిగింది. స్థానిక వార్డు మెంబర్ కోడిరెక్క వినోద్ ఆధ్వర్యంలో యువకులంతా గుంపులుగా ఏర్పడి రాత్రంతా నిద్రపోకుండా కాలనీలో గస్తీ కాస్తున్నారు. చీకటిని ఆసరాగా చేసుకుని దొంగతనాలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకే ఎవరైనా ఇలా లైట్లు ఆపేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలనీ యూత్ తెల్లవార్లూ జాగారం చేస్తూ కాలనీ మొత్తం జల్లెడ పడుతున్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి ఈ ఆకతాయిలను లేదా దోషులను పట్టుకుని, వీధి లైట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో… ఈ శునకం ట్యాలెంట్‌ మామలుగా లేదు!

సమోసా కోసం.. లోకోపైలెట్ ట్రైన్ ఆపాడా? నెట్టింట వీడియో వైరల్.. ఎంతవరకు నిజం?

కలను సాకారం చేసిన.. రూ.10 కాయిన్లతో రూ.1.10 లక్షల బైక్!

పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్‌తో వాహనాలు చెడిపోతాయా? నిజమెంత?

Follow Us