కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

Updated on: Jul 01, 2026 | 5:57 PM

ముంబైలో ఓ డెలివరీ పార్ట్‌నర్ అసభ్యకర వాయిస్‌మెయిల్ పంపిన ఘటన కలకలం రేపింది. ఫోన్ ఎత్తలేదనే కారణంతో మహిళను బూతులు తిడుతూ సందేశం వదిలినట్లు ఆమె ఆరోపించింది. సోషల్ మీడియాలో ఘటనను పంచుకుంటూ ముంబై పోలీసులకు, సంబంధిత లాజిస్టిక్స్ సంస్థకు ఫిర్యాదు చేసింది. ఈ పోస్టు వైరల్ కావడంతో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

ముంబైలో ఒక ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థకు చెందిన డెలివరీ పార్ట్‌నర్ ఒక మహిళను తీవ్రంగా వేధించాడు. డెలివరీ బాయ్ ఫోన్ కాల్‌ను మహిళ ఎత్తకపోవడంతో, ఆ కాల్ వాయిస్‌ మెయిల్‌కు డైవర్ట్‌ అయ్యింది. ఆ తర్వాత ఆమె ఆ వాయిస్‌ మెయిల్‌ను వినగా, అందులో అసభ్యకర పదజాలంతో ఉన్న సందేశం ఆమెను తీవ్రంగా భయపెట్టింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ముంబై పోలీసులకు, డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేసింది. మహిళ ఇంట్లో లేని సమయంలో డెలివరీ ఏజెంట్ ఆమెకు కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రికార్డ్ అయిన వాయిస్‌ మెయిల్‌లో అతని బూతుల పురాణం రికార్డయింది. బూతులు తిడుతూ హిందీలో ఆడియో మెసేజ్ పంపాడు. ఇది విన్న మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ భయానక అనుభవాన్ని నిషా బాలకృష్ణ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్‌ చేసింది. డెలివరీ ఏజెంట్‌కు తన ఇంటి చిరునామా పూర్తిగా తెలుసని, దీనివల్ల తనకు ప్రాణభయం పట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ముంబై పోలీసులను , షాడోఫాక్స్ సంస్థను ట్యాగ్ చేస్తూ తనకు న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లను కోపంతో కామెంట్లు పెట్టారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కామెంట్లలో ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరికొందరు మహిళలు కూడా డెలివరీ బాయ్స్ నుంచి తాము ఎదుర్కొన్న ఇలాంటి చేదు అనుభవాలను ఈ పోస్ట్ కింద షేర్‌ చేసారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్‌!

8 ఏళ్లుగా అత్త న్యాయ పోరాటం.. కోడలికి 7 ఏళ్ల జైలు శిక్ష!

బావిలో పడ్డ మేక.. ఆ తర్వాత..

Kailash-Manasarovar Yatra: కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక

Health Alert: న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?

Follow Us