పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త

Updated on: Feb 24, 2026 | 6:45 PM

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించే వారు జాగ్రత్తగా ఉండాలి. తెనాలిలో వెలుగుచూసిన ఈ ఘటన దానికి నిదర్శనం. ఒక వ్యక్తి విడాకులయ్యాయని నమ్మబలికి, మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన మహిళను పెళ్లి పేరుతో రూ.12.20 లక్షలు మోసం చేశాడు. డబ్బు అడిగితే దాడి చేసి బెదిరించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, మరికొందరు బాధితులను గుర్తించారు. మ్యాట్రిమోనీలో ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించే వారు తస్మాత్ జాగ్రత్త! అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ, పెళ్లి పేరుతో నిలువునా ముంచేస్తున్న కిలాడీగాళ్ల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెనాలిలో వెలుగుచూసిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. కొల్లిపర మండలం కొత్తూరు లంకకు చెందిన ఆరవపల్లి వంశీ అనే వ్యక్తి, తనకు విడాకులయ్యాయని నమ్మబలికి మ్యాట్రిమోనీ ద్వారా ఒక ప్రైవేట్ ఉద్యోగినిని పరిచయం చేసుకున్నాడు. బాధితురాలి ఆఫీసుకే వెళ్లడం, కుటుంబ సభ్యులతో మాట్లాడి నమ్మకాన్ని కలిగించడంలో వంశీ ఆరితేరిపోయాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, టిప్పర్ కొనుగోలు సాకుతో ఆమెతో ఏకంగా రూ. 12.20 లక్షల అప్పులు చేయించి ఆ సొమ్మును కాజేశాడు. మరింత డబ్బు కావాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు నిరాకరించింది. దీంతో వంశీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. ఆమెపై దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా.. వ్యక్తిగత విషయాలను బయటపెడతానని, చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తెనాలి త్రీటౌన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి ఫోన్ డేటాను పరిశీలించగా, ఇప్పటికే మరికొంతమంది మహిళలను కూడా ఇతడు మోసం చేసినట్లు ఆధారాలు దొరికాయని సిఐ సాంబశివరావు తెలిపారు. మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయమయ్యే వ్యక్తుల పూర్వాపరాలను క్షుణ్ణంగా విచారించకుండా ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..

Jai Hanuman: లాంఛనంగా మొదలైన జై హనుమాన్ సినిమా

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో అవేం ఉండవు.. తేల్చేసిన హరీష్ శంకర్..!

నాయికలను రిపీట్ చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. కారణం అదేనా ??

Rajamouli: రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ నాగ చైతన్య.. అసలు విషయం ఇదే

Follow Us