చీర కట్టినా..చివరికి దొరికిపోయాడు వీడియో

Updated on: Jun 24, 2025 | 9:01 PM

మహిళ వేషంలో ఉన్న ఈ వ్యక్తి పేరు దయా శంకర్.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. రాజస్థాన్‌కు చెందిన అతడి మీద 13 క్రిమినల్ కేసులు ఉన్నాయి. బెదిరింపులు, దొంగతనాలు, కొట్లాటలు ఇలా అన్ని రకాల నేరాలలో మనోడికి అనుభవం ఉంది. ఇటీవలే ఓ కేసులో పోలీసులు అతడ్ని పట్టుకుందామనుకునే లోనే.. వాళ్ల కన్నుగప్పి మాయమయ్యాడు.

కానీ, పోలీసులు తమదైన శైలిలో ఈ మాయగాడి కదలికలను గుర్తించి.. కటకటాల వెనక్కి నెట్టారు.కేసు వివరాల్లోకి వెళితే.. గతంలో దయా శంకర్.. 23 ఏళ్ల ప్రిన్స్ చావ్లా అనే యువకుడిపై తన గ్యాంగుతో దాడికి దిగాడు. అతడ్ని ఆ గ్యాంగు కర్రలు, బాటిళ్లతో చావకొట్టింది. కేసు పెడితే చంపేస్తామని బెదిరించింది. అయినా ప్రిన్స్ భయపడలేదు. దెబ్బల నుంచి కోలుకున్నాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వారిపై కేసు పెట్టాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన అతడిపై కేసు నమోదు అయింది. ఇక, అప్పటినుంచి పోలీసులు అతడి కోసం వెతుకుతూనే ఉన్నారు. అయితే, దయా.. పోలీసులను బురిడీ కొట్టించేందుకు మహిళలాగా చీర కట్టుకుని, ముఖం కనిపించకుండా ముసుగు కిందికి లాక్కొని పట్టపగలే వీధుల్లో దర్జాగా తిరుగుతూ తన పనులన్నీ చక్కబెట్టుకుంటూనే వచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం :

జ్యుయలరీ షాపునకు వెళ్లిన 93 ఏళ్ల వృద్ధుడు..అతను అడిగింది విని యజమాని ఫిదా వీడియో

చిరుతకే ఝలక్‌ ఇచ్చిన గ్రామ సింహం..ఎలా తప్పించుకుందంటే వీడియో

వద్దు నాన్నా.. భయమేస్తోంది వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us