రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి..దానిపైనే కునుకేసిన వ్యక్తి ! ఎక్కడంటే వీడియో

Updated on: Jun 24, 2025 | 9:00 PM

మందుబాబులా మజాకా.. మద్యం మత్తులో కొందరు మందుబాబులు నేరాలే కాదు..విచిత్రమైన పనులతో జనానికి నవ్వు కూడా తెప్పిస్తుంటారు. కొందరు తాగి రచ్చ చేస్తే, మరికొందరు ఎత్తైన టవర్లు, స్తంబాలు ఎక్కి ఏకంగా పోలీసులనే బెదిరిస్తుంటారు. ఇంకొందరు వాహనాలపై ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ ప్రాణాల మీదకూ తెచ్చుకుంటారు.

మందుబాబులా మజాకా.. మద్యం మత్తులో కొందరు మందుబాబులు నేరాలే కాదు..విచిత్రమైన పనులతో జనానికి నవ్వు కూడా తెప్పిస్తుంటారు. కొందరు తాగి రచ్చ చేస్తే, మరికొందరు ఎత్తైన టవర్లు, స్తంబాలు ఎక్కి ఏకంగా పోలీసులనే బెదిరిస్తుంటారు. ఇంకొందరు వాహనాలపై ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ ప్రాణాల మీదకూ తెచ్చుకుంటారు. అయితే, విజయవాడలో ఒక మందుబాబు మాత్రం.. పూటుగా మందేసి, రోడ్డు మీదే స్కూటీ ఆపేసి, దానిపైనే గుర్రుపెట్టి నిద్ర పోయాడు. ఈ విచిత్ర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన విజయవాడలోని శ్రీనగర్ కాలనీలో జరిగింది. ఊహించని రీతిలోనడిరోడ్డుపై అతగాడు చేసిన పనితో ఆ రోడ్డున పోతున్న వాహనదారులు,ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రోడ్డు మీద వాహనాలు హారన్ కొడుతూ పోతున్నా.. మనోడు మాత్రం సోయి లేకుండా నిద్రపోయాడు. దీంతో ఆ దారిన పోయే యువత.. అతడి ఫోటోలు, వీడియోలు తీసి నెట్టింట వైరల్‌ చేసి పారేశారు.

మరిన్ని వీడియోల కోసం :

జ్యుయలరీ షాపునకు వెళ్లిన 93 ఏళ్ల వృద్ధుడు..అతను అడిగింది విని యజమాని ఫిదా వీడియో

చిరుతకే ఝలక్‌ ఇచ్చిన గ్రామ సింహం..ఎలా తప్పించుకుందంటే వీడియో

వద్దు నాన్నా.. భయమేస్తోంది వీడియో