ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

Updated on: Mar 25, 2025 | 4:46 PM

ఒకటి రెండు రోజులు ఆఫీసుకు వెళ్లకపోతనే బాస్ తో అక్షింతలూ తప్పవు... నెలాఖరున జీతంలో కోతా తప్పదు. కానీ ఓ ఉద్యోగి ఏకంగా ఆరేళ్ల పాటు ఆఫీసు ముఖమే చూడలేదు. అలా అని వర్క్ ఫ్రం హోం చేసివుంటాడులే అనుకుంటే పొరపాటే. అసలు పనే చేయలేదు. అయినా నెలనెలా ఠంచనుగా జీతం మాత్రం అందుకున్నాడు.

సంస్థలోని రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం ఈ ఉద్యోగికి బాగా కలిసి వచ్చింది. ఇరవై ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్నందుకు సదరు ఉద్యోగికి సన్మానం చేసే ఏర్పాట్లు చేస్తుండగా ఈ విషయం బయటపడింది. దీంతో ఆ ఉద్యోగిపై కంపెనీ కోర్టుకెక్కింది. స్పెయిన్ లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. స్పెయిన్ లోని కాడిజ్ మున్సిపల్ వాటర్ కంపెనీలో జోయక్విన్ గార్సియా, ప్లాంట్ సూపర్ వైజర్ గా పనిచేశారు. 1990లో ఉద్యోగంలో చేరిన గార్సియా.. 2004 వరకు సక్రమంగా విధులు నిర్వహించాడు. వాటర్ ప్లాంట్ నిర్వహణ విషయంలో రెండు డిపార్ట్ మెంట్ ల మధ్య సమన్వయలోపం తలెత్తింది. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎవరికి వారు ఎదుటి డిపార్ట్ మెంట్ చూసుకుంటుందిలే అని నిర్వహణను గాలికి వదిలేశారు. ఈ విషయం గమనించిన గార్సియా.. 2004 నుంచి విధులు ఎగ్గొడుతూ వచ్చాడు. డ్యూటీకి వెళ్లకపోయినా ఎవరూ గుర్తించకపోవడంతో గార్సియా జీతం నెలనెలా అతడి బ్యాంకు ఖాతాలో పడింది. ఏడాదికి 41,500 డాలర్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో 36 లక్షలు అందుకుంటూ ఎంజాయ్ చేశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పనస తొనలు ఆరోగ్యమే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం

రష్మికతోనే కాదు.. ఆమెకు పుట్టబోయే కూతురితో కూడా నటిస్తా..

తుది తీర్పు !! సుశాంత్ మరణానికి జస్టిస్‌ ఇదేనా ??

కన్నప్ప ట్రోల్ చేసిన వారికి.. ఆ శివయ్య శాపం తగులుతుంది

పోలీసుల దెబ్బకు ఆగిపోయిన సుప్రీం హీరో సినిమా..

Loading...
Unable to load recommendations.
Follow Us