Viral Video: నా మామ కట్నంగా రైలు ఇచ్చారు.. నడపడం రాదని వద్దన్నాను..! అంటున్న ఈ వ్యక్తి.. వైరల్ వీడియో

Updated on: Feb 27, 2022 | 12:25 PM

తాజాగా ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అత్తమామలు కట్నంగా తనకు రైలు ఇచ్చారని ఓ యువకుడు చెబుతాడు. అతను దానిని తీసుకోకుండా తిరస్కరించాడట. ఎందుకు తీసుకోలేదని వీడియో తీస్తున్న వ్యక్తి ప్రశ్నించగా..’నాకు రైలు నడపడం రాదు..


తాజాగా ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అత్తమామలు కట్నంగా తనకు రైలు ఇచ్చారని ఓ యువకుడు చెబుతాడు. అతను దానిని తీసుకోకుండా తిరస్కరించాడట. ఎందుకు తీసుకోలేదని వీడియో తీస్తున్న వ్యక్తి ప్రశ్నించగా..’నాకు రైలు నడపడం రాదు.. అందుకే వద్దన్నానని’ చెబుతాడు. అంతే కాకుండా రైలు పార్క్ చేసేందుకు తన ఇంట్లో స్థలం లేకపోవడంతో రైలును తీసుకునేందుకు నిరాకరించినట్లు చెబుతాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం వింత కామెంట్లతో ఓ ఆట ఆడేసుకున్నారు. నాకు కూడా కట్నంగా మా అత్తింటివారు రాకెట్‌ ఇచ్చారు. కానీ నాకు బైక్‌ నడపడమంటేనే ఇష్టం అందుకే వద్దన్నానని ఒకరు, ఏంది భయ్యా! నువ్వు అబద్ధం చెబుతున్నట్టున్నావు…ఐనా నువ్వు చెప్పిన విషయం బలే తమాషాగా ఉందని మరొకరు సరదాగా కామెంట్లు చేశారు. ఇక వీడియో ఇప్పటికే దాదాపు 9 లక్షల వ్యూస్‌, వేలల్లో లైకులు, కామెంట్లతో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుందో తెలియదు కానీ పాత వీడియో అయినప్పటికీ మళ్లీ వార్తల్లో నిలిచింది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..

Loading...
Unable to load recommendations.
Follow Us