English Auto Driver: ఇంగ్లీష్ అదరగొడుతున్న ఆటోవాలా.! నెట్టింట వీడియో వైరల్..
ఆ వీడియోలో ఆ పెద్దాయన ఇంగ్లీష్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ బతకాలన్నా ఇంగ్లిష్ రావడం తప్పనిసరి అని చెప్పాడు. ‘మీరు లండన్, పారిస్, అమెరికా, టోక్యో లాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇంగ్లిష్ రావాల్సిందే. లేకపోతే మీరు అక్కడకు వెళ్లలేరు. ఉదాహరణకు మీరు లండన్ లో ఏదైనా హోటల్ కు వెళ్లి ఓ గ్లాస్ మంచినీళ్లు కావాలని ఇంగ్లిష్ లో అడిగితే టక్కున తెచ్చిస్తారు. అదే మీరు మరాఠీలో అడిగితే ఈ హోటల్ లో మీకు ప్రవేశం లేదు.. గెటవుట్ అంటారు’ అంటూ ఇంగ్లిష్ లో ఆ ఆటోడ్రైవర్ చెప్పుకొచ్చాడు.
మహారాష్ట్రలోని అమరావతిలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ పెద్దాయన తన ఇంగ్లిష్ వాగ్ధాటితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎక్కడా తడుముకోకుండా టకటకా ఇంగ్లీష్ మాట్లాడుతూ అదరగొడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆ పెద్దాయన ఇంగ్లీష్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ బతకాలన్నా ఇంగ్లిష్ రావడం తప్పనిసరి అని చెప్పాడు. ‘మీరు లండన్, పారిస్, అమెరికా, టోక్యో లాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇంగ్లిష్ రావాల్సిందే. లేకపోతే మీరు అక్కడకు వెళ్లలేరు. ఉదాహరణకు మీరు లండన్ లో ఏదైనా హోటల్ కు వెళ్లి ఓ గ్లాస్ మంచినీళ్లు కావాలని ఇంగ్లిష్ లో అడిగితే టక్కున తెచ్చిస్తారు. అదే మీరు మరాఠీలో అడిగితే ఈ హోటల్ లో మీకు ప్రవేశం లేదు.. గెటవుట్ అంటారు’ అంటూ ఇంగ్లిష్ లో ఆ ఆటోడ్రైవర్ చెప్పుకొచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఆంగ్లం నేర్చుకుని మాట్లాడాలని సూచించాడు. ఇంగ్లిష్ ను అంతర్జాతీయ భాషగా అభివర్ణించాడు. తన గమ్యస్థానం చేరుకోగానే ఓ వ్యక్తి ఆటోలోంచి దిగి ఆయనతో మాట్లాడుతూ ఈ వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘నేను ఇవాళ ఓ ఆటో డ్రైవర్ గా పనిచేసే పెద్దాయన్ను కలిసి ఆశ్చర్యపోయా. ఎందుకంటే.. ఆయన అనర్గళంగా ఇంగ్లిష్ లో మాట్లాడుతున్నారు. ఆయనతో మాట్లాడేటప్పుడు నేనే కాస్త తడబడ్డాను. మామధ్య సరదా సంభాషణ సాగింది. అయితే అందరినీ ఇంగ్లిష్ లో మాట్లాడాలని ఆయన చైతన్యవంతులను చేయడం ఆశ్చర్యం కలిగించింది’ అని ఆ వీడియో కింద క్యాప్షన్ ను జత చేశాడు. ఈ వీడియోను ఇప్పటికే 30 లక్షలమందికి పైగా వీక్షించారు. వీడియో చూసిన నెటిజన్లు ఆ పెద్దాయన ఇంగ్లిష్‌కి ఫిదా అవుతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.