రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్‌.. భయంతో వణికిపోయిన జనం

Updated on: Apr 17, 2026 | 1:08 PM

చిత్తూరు జిల్లా భీమవరం వద్ద ఒంటరి ఏనుగు ప్రధాన రహదారిపై అరగంట పాటు సంచరించి ట్రాఫిక్‌ను నిలిపివేసింది. కల్లూరు-తిరుపతి మార్గంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగు అడవిలోకి వెళ్ళాక ఊపిరి పీల్చుకున్నారు. అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రహదారులపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగులను రెచ్చగొట్టవద్దని సూచించారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. భీమవరం అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపైకి ఒక్కసారిగా గజరాజు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు అరగంట పాటు ఏనుగు రోడ్డుపైనే తిష్ట వేయడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అడవిలో నుంచి బయటకు వచ్చిన ఒంటరి ఏనుగు, రోడ్డు మధ్యలో నిల్చుని ఘీంకరిస్తూ అటూ ఇటూ తిరిగింది. ఆ సమయంలో కల్లూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సుతో పాటు పలు ద్విచక్ర వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. రోడ్డుపై ఏనుగును చూసిన ప్రయాణికులు బస్సు కిటికీలు మూసేసి లోపలే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయారు. అరగంట పాటు రోడ్డుపైనే పహారా కాసినట్లుగా తిరిగిన గజరాజు, ఆ తర్వాత మెల్లగా అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రహదారులపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగులు కనిపించినప్పుడు వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చోరీ చేయడం ఈజీగా దొరికిపోవడం ఈ దొంగ ప్రత్యేకత

తల్లిదండ్రులు తినే చపాతీలలో ఎలుకల మందు కలిపిన కూతురు..

JD Chakravarthy: స్లో పాయిజన్‌ ఇచ్చారు.. చావు అంచులదాకా వెళ్లా..

‘హోటల్లో పని చేస్తున్నప్పుడు చూసి చిరు అవకాశం ఇచ్చారు.. కానీ

Sridevi: జురాసిక్ పార్క్ సినిమా హీరోయిన్ ఛాన్స్ !! లైట్ తీసుకుని నో చెప్పిన శ్రీదేవి

Loading...
Unable to load recommendations.
Follow Us