Little boy: జ్యూస్‌ని ఇలా కూడా తాగొచ్చా..బుడ్డోడు తెలివికి మామ షాక్‌..! ట్రెండ్ అవుతున్న వీడియో..

|

Feb 18, 2023 | 9:16 PM

ఓ వ్యక్తి తన చిన్నారి మేనల్లుడు జాక్‌కి గ్లాస్‌లో జ్యూస్‌ ఎలా పోయాలో చూపిస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నారిని అతని మామయ్య నువ్వు ఏ చేత్తో జ్యూస్‌ గ్లాసులో పోస్తావు అని అడిగాడు.

చిన్న పిల్లలు అమాయకత్వంతో మాట్లాడే మాటలు అలరిస్తాయి.. కల్లాకపటం తెలియని పసివాళ్లు చేసే పనులు అల్లరికూడా ఆనందాన్నిస్తుంది. సోషల్ మీడియాలో చిన్నారులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ పసివాడు తన మేనమామతో కలిసి చేసిన చిలిపి పని నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో క్రిస్‌ అనే ఓ వ్యక్తి తన చిన్నారి మేనల్లుడు జాక్‌కి గ్లాస్‌లో జ్యూస్‌ ఎలా పోయాలో చూపిస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నారిని అతని మామయ్య నువ్వు ఏ చేత్తో జ్యూస్‌ గ్లాసులో పోస్తావు అని అడిగాడు. అందుకు ఆ చిన్నారి రైట్‌ హ్యాండ్‌ అనిచెప్పాడు. దాంతో ముందుగా క్రిస్‌ కొంచె జ్యూస్‌ గ్లాస్‌లో పోసి, ఆ తర్వాత చిన్నారిని వెయ్యమని చెప్పాడు. దాంతో ఆ చిన్నారి జ్యూస్‌ జార్‌ తీసుకొని గ్లాస్‌లో పోస్తుండగా జ్యూస్‌ మొత్తం టేబుల్‌పైన పడిపోయింది. అంతేకాదు అతను జ్యూస్‌ వేస్తున్న గ్లాస్‌ కూడా పడిపోయింది. దాంతో ఎందుకలా చేశావ్‌.. జ్యూస్‌ మొత్తం వేస్ట్‌ అయింది అనగానే ఆ బుడ్డోడు మారు మాట్లాడకుండా టేబుల్‌పైకి వంగి నోటితో జ్యూస్‌ మొత్తం లాగించేసాడు. అది చూసి అతని మామయ్య ఆశ్చర్యపోయాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 1.4 మిలియన్లమంది వీక్షించారు. కాగా ఈ మామ,అల్లుళ్లు సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కూడా. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు చిన్నారి చేసిన పనికి తెగనవ్వుకుంటున్నారు. సో క్యూట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు అలా చేయడం ప్రమాదం అంటూ సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 18, 2023 09:16 PM