శివుని చుట్టూ చిరుతలు-భక్తులకు భయంతో చెమటలు

|

Aug 17, 2024 | 10:02 PM

శ్రీశైలంలో చిరుత సంచారం ఇటు స్థానికులను, అటు భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. మొన్న పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి వద్ద చిరుత కనిపించింది. ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా తృటిలో ఆ కుక్క తప్పించుకుంది. తాజాగా మరోసారి శ్రీశైంలంలో చిరుత కనిపించింది. చిరుత సంచారంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

శ్రీశైలంలో చిరుత సంచారం ఇటు స్థానికులను, అటు భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. మొన్న పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి వద్ద చిరుత కనిపించింది. ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా తృటిలో ఆ కుక్క తప్పించుకుంది. తాజాగా మరోసారి శ్రీశైంలంలో చిరుత కనిపించింది. చిరుత సంచారంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం జలాశయం దిగువన ఉన్న లింగాలగట్టు బోయ క్యాంపు సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది చిరుత సంచారంతో స్థానిక బోయ క్యాంప్ మత్స్యకార కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. గత 20 రోజులుగా చిరుత సంచరిస్తూ కోళ్లు,కుక్కలను ఎత్తుకెళ్తోందని, రాత్రి 8 దాటితే ఇంటినినుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదని లింగాలగట్టు గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. గురువరాం కూడా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చిరుత సంచారాన్ని తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు స్ధానికులు. అధికారులు స్పందించి చిరుతను బంధించాలని లింగలగట్టు బోయ క్యాంప్ వాసులు కోరుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజు సాయంతో 600 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గాడు !!

పెళ్లైన హీరోతో యవ్వారం నడిపింది.. కట్ చేస్తే కెరీర్ క్లోజ్..

స్టెప్పు విషయంలో మొహమాటానికి పోయి.. అడ్డంగా బుక్కైన హరీష్‌

హరి హర యాక్షన్ బిగెన్స్.. రంగంలోకి దిగుతున్న డిప్యూటీ సీఎం

రామ్‌ చరణ్‌ను ఆకాశానికెత్తిన.. హాలీవుడ్ స్టార్ హీరో

Follow us on