Leopard: ఇనుప కంచెలో ఇరుక్కున్న చిరుత.! భయంతో అరుపులు.. వీడియో.
తమిళనాడులోని నీలగిరి అటవీ ప్రాంతంలో ఓ ప్రైవేట్ గార్డెన్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెకు అటుగా వెళుతున్న ఓ చిరుతపులి పొరపాటున చిక్కుకుంది. సమాచారం అందుకున్న అటవీ బృందం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 6 గంటలు కష్టపడి చిరుతను రక్షించారు. కోయంబత్తూరు జిల్లా నీలగిరి ఉత్తై సమీపంలోని తిటుక్కల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆహారం వెతుక్కుంటూ తిరగాడుతున్న చిరుతపులి ఓ ప్రైవేట్ గార్డెన్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలో ఇరుక్కుంది.
తమిళనాడులోని నీలగిరి అటవీ ప్రాంతంలో ఓ ప్రైవేట్ గార్డెన్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెకు అటుగా వెళుతున్న ఓ చిరుతపులి పొరపాటున చిక్కుకుంది. సమాచారం అందుకున్న అటవీ బృందం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 6 గంటలు కష్టపడి చిరుతను రక్షించారు. కోయంబత్తూరు జిల్లా నీలగిరి ఉత్తై సమీపంలోని తిటుక్కల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆహారం వెతుక్కుంటూ తిరగాడుతున్న చిరుతపులి ఓ ప్రైవేట్ గార్డెన్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలో ఇరుక్కుంది. వెనుక కాలును విడిపించుకునేందుకు చిరుత శతవిధాలా ప్రయత్నించింది. చిరుత అరుపుల శబ్ధం విన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు నీలగిరి అటవీ అధికారులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న అధికారులు చిరుతను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టారు. దగ్గర్లోని ముదుమలై ఎలిఫెంట్ క్యాంప్‌కు చెందిన వెటర్నీరీ డాక్టర్‌ను పిలిపించారు. వైద్యుడు రాజేష్ వచ్చి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో చిరుత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అనంతరం చిరుతను బంధించిన అటవీశాఖ సిబ్బంది సమీపంలోని పార్సన్స్ వ్యాలీ అడవుల్లో విడిచిపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

