Goat-little boy: నాతో పెట్టుకుంటే మఠాషే.. మేకతో చిన్నారి కుంగ్ ఫూ.. నవ్వులు పూయిస్తున్న క్యూట్ వీడియో..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. వారు చేసే అల్లరి పనులు ఎంతో నవ్వు తెప్పిస్తాయి. కొన్ని సార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వారి ఆగడాల
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. వారు చేసే అల్లరి పనులు ఎంతో నవ్వు తెప్పిస్తాయి. కొన్ని సార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వారి ఆగడాల గురించి చెప్పాల్సిన పనే లేదు. పెట్స్ తో ఎంతో సంబరంగా ఆడుకుంటూ మురిసిపోతుంటారు. అవి కూడా చిన్నారులతో కలిసి పోయి సరదాగా ఆడుకుంటుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పిల్లవాడు పెంపుడు జంతువుతో కుంగ్ ఫూ చేస్తున్నాడు. ఈ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది.ఈ వీడియోలో ఓ చిన్నారి.. మేక ముందు కుంగ్-ఫూ చేస్తున్నాడు. ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత మేకకు పట్టరాని కోపం వచ్చింది. అతడు చేసే పనికి చిర్రెత్తి తలతో పిల్లవాడిని ఒక్క తోపు తోసింది. దాంతో బుడ్డోడు కింద పడిపోయాడు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈ ఫన్నీ వీడియో ఓ యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 5 సెకన్ల ఈ వీడియోను వేలాదిమంది వీక్షించగా వందలాది మంది లైక్ చేశారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. కామెంట్‌లో నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!