డబ్బాలో ఇరుక్కున్న శునకం తల.. ఏం చేసిందో తెలుసా!
"అయ్యో పాపం.. ఎంత కష్టం వచ్చింది" - కడపజిల్లా బద్వేల్‌లోని విద్యానగర్ వీధుల్లో ఓ శునకాన్ని చూసి అందరినోటా వస్తున్న మాట ఇది. పాపం ఆకలికి ఓ డబ్బాలో కనిపించిన ఆహారం తిని కడు నింపుకోవాలని ప్రయత్నించిన ఆ శునకానికి ఇప్పుడు అదే దాని ప్రాణాల మీదకు తెచ్చింది. ప్లాస్టిక్ డబ్బాలో తల ఇరుక్కుపోయి, శ్వాస ఆడక, నీరు తాగలేక ఆ శునకం పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీకావు.
ఆకలితో ఉన్న ఆ శునకం, ఆహారం కోసం వెతుకుతూ రోడ్డు పక్కన పడేసిన ఒక ప్లాస్టిక్ డబ్బాలో తల దూర్చింది. లోపల ఉన్నది తినాలనే ఆశతో తల పెట్టింది కానీ, పాపం తలను బయటకు తీయడం మాత్రం సాధ్యం కాలేదు. గంటల తరబడి ప్రయత్నించినా డబ్బా రాకపోవడంతో, ఆ కుక్క అలాగే వీధుల వెంబడి తిరుగుతోంది. ఆహారం తినలేక, ఊపిరాడక ఆ శునకం పడుతున్న ఆవేదన చూసి స్థానికులు అయ్యోపాపం ఈ శునకానికి ఎంతకష్టం వచ్చిందంటూ చర్చించుకున్నారు. కొందరు శునకం తల నుంచి డబ్బాను తొలగించే ప్రయత్నం చేసారు కానీ, అది ఓపట్టాన రాకపోవడంతో గట్టిగా లాగితే ఆ నొప్పికి శునకం తమనెక్కడ కరుస్తుందోనని భయపడి అలానే వదిలేసి వెళ్లిపోయారు. ఎండ తీవ్రతకు తోడు, తాగడానికి చుక్క నీరు కూడా అందక ఆ జీవి నీరసించిపోయింది. ఎవరైనా వచ్చి తనను ఈ బంధనం నుంచి విముక్తి చేస్తారేమోనని అది ఎదురుచూస్తున్న తీరు అత్యంత దయనీయంగా ఉంది.
మరిన్ని వీడియోల కోసం :