హెల్మెట్‌లు పెట్టుకుని చోరీకి వచ్చిన దొంగలు !!

Updated on: Nov 02, 2023 | 9:54 PM

ప్రస్తుత సమాజంలో కష్టపడి సంపాదించే వారి కంటే అడ్డదారులు ఎంచుకొని సంపాదించే వారే ఎక్కువయ్యారు. కుటుంబ బాధ్యతలను మరిచి జల్సాలకు అలవాటు పడిన వ్యక్తులు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దొంగలు తెగబడ్డారు. ముగ్గురు దొంగలు తలలకు హెల్మెట్‌లు పెట్టుకుని జ్యుయెలరీ షాపులో చొరబడ్డారు. పిస్టల్‌లు పట్టుకుని లోపలికి వచ్చిన దొంగలు కదిలితే కాల్చిపారేస్తామని కస్టమర్లను, సేల్స్‌ పర్సన్స్‌ను బెదిరించారు.

ప్రస్తుత సమాజంలో కష్టపడి సంపాదించే వారి కంటే అడ్డదారులు ఎంచుకొని సంపాదించే వారే ఎక్కువయ్యారు. కుటుంబ బాధ్యతలను మరిచి జల్సాలకు అలవాటు పడిన వ్యక్తులు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దొంగలు తెగబడ్డారు. ముగ్గురు దొంగలు తలలకు హెల్మెట్‌లు పెట్టుకుని జ్యుయెలరీ షాపులో చొరబడ్డారు. పిస్టల్‌లు పట్టుకుని లోపలికి వచ్చిన దొంగలు కదిలితే కాల్చిపారేస్తామని కస్టమర్లను, సేల్స్‌ పర్సన్స్‌ను బెదిరించారు. క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న నగదును వెంట తెచ్చుకున్న బ్యాగులో సర్దుకుని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే, పారిపోయే క్రమంలో జ్యుయెలరీ షాపు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఒక దొంగను పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఒక పిస్టల్‌ను, నాలుగు లైవ్‌ బుల్లెట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మరో ఇద్దరు దొంగల కోసం గాలిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీలోని కరవాల్‌ నగర్‌ ఏరియాలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. దొంగలు జ్యుయెలరీ షాపును దోచుకున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క ఉద్యోగానికి ఇంతమందా ?? నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతున్న వీడియో

ఆటో డ్రైవర్ ఆకాశంలో.. ప్రయాణికులు నేలపై.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో

ఇజ్రాయెల్‌కు చమురు, ఆహార ఎగుమతులు ఆపండి.. ఇరాన్‌ పిలుపు

Mini Bullet: నెట్టింట చక్కర్లు కొడుతున్న మినీ బుల్లెట్‌..

అమెరికాలో తెలంగాణ విద్యార్ధిపై దాడి.. పరిస్థితి విషమం

 

Loading...
Unable to load recommendations.
Follow Us