Sunita Williams Health: సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణించిందా.? వైరల్ అవుతున్న ఫోటోలు..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో ఉన్న వ్యోమగాములకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియన్స్ బరువు తగ్గినట్లుగా, నీరసంగా ఉన్నట్లు కనిపించడం ఆందోళనకు గురి చేసింది. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లనే ఆమె బలహీనంగా కనిపిస్తున్నారని..
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియన్స్ బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్యాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని వచ్చిన వార్తలపై నాసా స్పందించింది. సునీతా విలియన్స్ సహా వ్యోమగాములందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని నాసా తెలిపింది. వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతాయని, ఫ్లైట్ సర్జన్లు పర్యవేక్షిస్తారని వెల్లడించింది.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైన్ స్పేస్‌షిప్‌లో ఐఎస్‌ఎస్‌కి వెళ్లారు. ఆ తర్వాత స్టార్‌లైర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తిరిగి భూమికిపైకి చేరుకోవడంలో ఆలస్యమైంది. ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 2025లో తిరిగి భూమికి తీసుకురానున్నట్లు తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.