Watch: బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ నినాదాలు..

|

Oct 21, 2024 | 9:52 AM

ప్రస్తుత కాలంలో యువత వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ అభిరుచులను నిరభ్యంతరంగా వ్యక్తపరుస్తున్నారు. తాము ధరించే దుస్తులు దగ్గరనుంచి వారి స్నేహితుల వరకూ ఎలాంటి వారు కావాలో, అతను ఎలా ఉండాలో నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తున్నారు. తాజాగా మధ్య ప్రదేశ్‌లో ఇండోర్‌ సిటీలో కొందరు యువతులు ఓ అడుగు ముందుకేసి తమకు ఎలాంటి ప్రియుడు కావాలో చెబుతూ ఏకంగా ఓ ర్యాలీ నిర్వహించారు.

ప్రస్తుతం యువ‌త ఫ్యాష‌న్ విష‌యంలో కొత్త పుంత‌లు తొక్కుతున్నారు. ట్రెండీ లుక్స్ కోసం ప‌రిత‌పిస్తున్నారు. మారుతున్న కాలానుగుణంగా యువ‌త‌లో ఫ్యాష‌న్ అభిరుచులు మారుతున్నాయి. అబ్బాయిల్లో కొంద‌రు గ‌డ్డం పెంచి ఫ్యాష‌న్‌గా క‌నిపిస్తుంటే, మ‌రికొంద‌రు క్లీన్ షేవ్‌లో క‌నిపించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇక అమ్మాయిల్లో కొంద‌రు క్లీన్ షేవ్‌లో ఉండే అబ్బాయిల‌ను ఇష్టప‌డితే, మ‌రికొంద‌రు గ‌డ్డంతో ట్రెండీగా ఉండే అబ్బాయిల‌ను కోరుకుంటారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఇండోర్‌లో కొంద‌రు కాలేజీ యువ‌తులు అబ్బాయిల గ‌డ్డం విష‌య‌ంలో భారీ ర్యాలీ నిర్వహించి అంద‌రినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తమకు గ‌డ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలంటూ యువ‌తులు ఈ వినూత్న ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ‘గ‌డ్డం తొలగించండి.. ప్రేమ‌ను కాపాడండి’ అనే నినాదంతో యువ‌తులు ముఖాల‌కు గ‌డ్డం మేక‌ప్‌ వేసుకొని ర్యాలీ నిర్వహించారు.

ఇక వారి చేతిలో ఉన్న ప్లడ్‌కార్డుల‌పై ‘నో క్లీన్ షేవ్.. నో ల‌వ్‌’, ‘మాకు గ‌డ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి’, ‘నో క్లీన్ షేవ్‌.. నో గ‌ర్ల్‌ఫ్రెండ్’ వంటి లైన్స్ క‌నిపించాయి. ఇక‌ ఈ ర్యాలీ తాలూకు వీడియోను ఓ ‘ఎక్స్’ యూజ‌ర్ నెట్టింట పోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. వారి డిమాండ్ క‌రెక్టే.. వారానికి ఒక‌సారైనా క్లీన్ షేవ్ కాకున్నా క‌నీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మ‌నం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్‌మెన్‌లా క‌నిపిస్తాంఅని ఒక‌రు కామెంట్ చేస్తే… వారి గ‌డ్డం.. వారి ఇష్టం.. మ‌ధ్యలో మీకెందుకు అని ఇంకొక‌రు కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on