10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం! బ్యాంకాక్‌లో భారత మహిళ పోస్ట్ వైరల్

Updated on: May 21, 2026 | 4:20 PM

బ్యాంకాక్‌లో రిమోట్ వర్క్ చేస్తున్న శ్రేయ మహేంద్రు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేగవంతమైన డెలివరీల కంటే స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన ఉదయాలు, సురక్షితమైన రోడ్లకే తాను ప్రాధాన్యం ఇస్తానని ఆమె పేర్కొన్నారు. భారత నగరాల్లో పెరుగుతున్న శబ్ద కాలుష్యం, ట్రాఫిక్, రద్దీపై ఆమె చేసిన వ్యాఖ్యలు యువతలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై కొత్త చర్చకు దారితీశాయి.

బ్యాంకాక్‌లో రిమోట్ వర్క్ చేస్తున్న శ్రేయ మహేంద్రు అనే మహిళ, భారత నగరాల్లోని హడావుడి జీవితం కంటే థాయ్‌లాండ్ రాజధానిలోని ప్రశాంత వాతావరణమే తనకు నచ్చిందని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోను షేర్‌ చేసారు. ఆ వీడియో నెటిజన్ల మనసులను తాకడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.10 నిమిషాల డెలివరీ సంస్కృతి కంటే స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన రోడ్లు, వాకర్లకు అనువైన వీధులు, పౌర స్పృహ, ప్రశాంతమైన ఉదయాలు తనకు ముఖ్యం అని శ్రేయ తన వీడియోలో అన్నారు. ట్రాఫిక్ హారన్ల హోరు మధ్య జీవించడం కన్నా, ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలతో నిద్రలేవడానికే తాను ఇష్టపడతానని తెలిపారు. పట్టణాలలో ప్రజలు వేగం, సౌకర్యాల వైపు పరుగులు పెడుతున్న క్రమంలో కనీస జీవన ప్రమాణాలను విస్మరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ శబ్దాల కంటే పక్షుల అరుపులు, కాలుష్యం లేని నీలాకాశం అందరికీ కావాలి అంటూ వీడియోలో తెలిపారు. పట్టణాల్లో మెరుగైన పరిస్థితులు తీసుకురావడం కేవలం ప్రభుత్వాల బాధ్యతే కాదని, పౌరుల ప్రవర్తనపై కూడా ఇది ఆధారపడి ఉంటుందని శ్రేయ స్పష్టం చేశారు. రిమోట్ వర్క్ విధానం తనకు వివిధ దేశాల్లో పర్యటించే స్వేచ్ఛను ఇచ్చిందని, చివరికి ప్రశాంతంగా, నివాసయోగ్యంగా అనిపించడంతోనే బ్యాంకాక్‌ను ఎంచుకున్నానని ఆమె వివరించారు. శ్రేయ వీడియో భారతీయ నెటిజన్లలో పట్టణ జీవనంపై ఓ కొత్త చర్చను రేకెత్తించింది. చాలామంది ఆమె అభిప్రాయాలతో ఏకీభవించారు. నిరంతర శబ్దం, కాలుష్యం, రద్దీ భారత నగరాల్లో సర్వసాధారణమైపోయాయని కామెంట్లు పెట్టారు. విదేశాలకు వెళ్లినప్పుడే మన నగరాల్లోని జీవనంతో ఎంత అలసిపోతున్నామో అర్థమవుతుందని పలువురు కామెంట్లు చేశారు. ముఖ్యంగా రిమోట్ వర్క్ చేస్తున్న యువతరం, వేగవంతమైన జీవనశైలి కంటే మానసిక ప్రశాంతత, స్వచ్ఛమైన పర్యావరణం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని.. ఈ చర్చ స్పష్టం చేస్తోంది

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు

వామ్మో… ఆ ఊరి నిండా పాములే! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న గ్రామం

Aadhaar Update: ఆధార్ అప్డేట్‌‌పై కేంద్రం గుడ్‌ న్యూస్‌

భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

Follow Us