అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి విద్యుద్దీకరణ కలిగిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను విజయవంతంగా ప్రారంభించాయి. డబుల్ స్టాక్ కంటైనర్ రైళ్లను నడుపుతూ లాజిస్టిక్స్ ఖర్చులు, రవాణా సమయాన్ని గణనీయంగా తగ్గించాయి. ఈ అద్భుత ప్రాజెక్ట్ దేశ ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్యానికి వెన్నెముకగా నిలుస్తోంది, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారింది.
భారతీయ రైల్వేలు సాధించిన అద్భుత రికార్డుతో దేశం గర్వపడేలా చేసింది. ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కాని రీతిలో తొలి పూర్తి విద్యుద్దీకరణ కలిగిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను భారత్ విజయవంతంగా అందుబాటులోకి తెచ్చింది. అమెరికా, కెనడా వంటి దేశాల్లో డబుల్ స్టాక్ రైళ్లు ఉన్నప్పటికీ, అవి డీజిల్ ఇంజిన్లతోనే నడుస్తున్నాయి. కానీ, పూర్తిగా విద్యుద్దీకరించబడిన సరుకు రవాణా మార్గాన్ని కలిగి ఉన్న ఏకైక దేశంగా భారత్ నిలిచింది.సరుకు రవాణాను వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2006లో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 1337 కిలోమీటర్ల తూర్పు కారిడార్ ఇప్పటికే అందుబాటులోకి రాగా, తాజాగా పశ్చిమ కారిడార్ కూడా పూర్తయింది. దీంతో మొత్తం సరుకు రవాణా మార్గం 2,843 కిలోమీటర్లకు చేరింది. ఈ వెస్ట్రన్ కారిడార్‌లో ఎత్తైన ఓవర్‌హెడ్ వైర్లు ఉండటం వల్ల రెండు కంటైనర్‌లను ఒకదానిపై ఒకటి ఉంచి రవాణా చేసే డబుల్ స్టాక్ రైళ్లను విజయవంతంగా నడుపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
బిగ్ బాస్ టాస్కులేమో కానీ ఆ కంటెస్టెంట్ నడుము విరిగినంత పనైంది
నేనే త్రిష స్థానంలో ఉంటే..నటి అంబిక షాకింగ్ కామెంట్స్