మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!

Updated on: Mar 19, 2026 | 1:40 PM

హైదరాబాద్‌లో వేసవి వేడి ముందే మొదలైంది. భూగర్భ జలాలు అడుగంటి, ట్యాంకర్ల కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి వస్తుండటంతో.. తాగునీటి దుర్వినియోగంపై హైదరాబాద్ జలమండలి ఉక్కుపాదం మోపుతోంది. ఇకపై తాగునీటిని వృథా చేస్తే ఏకంగా రూ. 5,000 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆ.. ఏముందిలే.. ఈ వార్నింగ్‌లు మనకు మామూలే అనుకుంటే పొరపాటే..కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా, అధికారులు ఇప్పుడు ప్రత్యక్ష చర్యలకు దిగుతున్నారు. ఇంటి ముందు ఫ్లోర్లు కడగడం, వాహనాలు శుభ్రం చేయడం లేదా గార్డెనింగ్‌కు తాగునీటిని వాడితే జరిమానా తప్పదు. అంతేకాదు, ఇక్కడ మరో విషయమేంటంటే.. ఎవరైనా నీటిని వృథా చేస్తుంటే సామాన్య ప్రజలు కూడా వారిని పట్టించవచ్చు. వృథా చేస్తున్న ఫోటోలు లేదా వీడియోలను జలమండలికి పంపితే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో తాగునీటితో వాహనాలను కడుగుతున్నట్లు అందిన ఫిర్యాదుపై అధికారులు మెరుపు దాడి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి అక్కడికక్కడే రూ. 5,000 ఫైన్ విధించి షాక్ ఇచ్చారు. నగరవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ఇటువంటి వారిపై నిఘా ఉంచనున్నాయి. నీటి వృథాను అరికట్టేందుకు ప్రజల సహకారాన్ని అధికారులు కోరుతున్నారు. ఎక్కడైనా దుర్వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే జలమండలి వాట్సాప్ నంబర్ 99499 30003 లేదా కస్టమర్ కేర్ నంబర్ 155313 కు సమాచారం అందించాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం :

ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో

బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

 

 

Follow Us