ఉస్మానియా వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
Government Hospital Medical Breakthrough, Child Liver Transplant Success ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 18 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి చేసి చరిత్ర సృష్టించింది. గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్ తో బాధపడుతున్న బాలుడికి, తండ్రి దానం చేసిన కాలేయంతో 14 గంటల శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా జరిగిన ఈ క్లిష్టమైన సర్జరీ, ప్రభుత్వ ఆసుపత్రుల సామర్థ్యాన్ని చాటిచెప్పింది. ఇది పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ఉస్మానియాకు గర్వకారణం.
ప్రభుత్వ వైద్య రంగంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న 18 నెలల పసికందును అత్యంత క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా కాపాడి, చరిత్ర సృష్టించారు వైద్యులు. కేవలం 10 కిలోల బరువున్న ఆ బాలుడు ‘గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్’ అనే అరుదైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివల్ల కాలేయం పనితీరు దెబ్బతినడంతో బాలుడి తండ్రి తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఉస్మానియా వైద్యుల బృందం దాదాపు 14 గంటల పాటు శ్రమించి అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. తండ్రి నుంచి సేకరించిన కాలేయ భాగాన్ని చిన్నారికి విజయవంతంగా అమర్చారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందించారు. దేశంలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి క్లిష్టమైన సర్జరీలు జరగడం అత్యంత అరుదు. చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన ఉస్మానియా డాక్టర్ల బృందాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ఉస్మానియా ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న రైలుపై అగ్నికీలలు.. చివరిలో షాకింగ్ ట్విస్ట్
వీడుతున్న ముంబై పుచ్చకాయ మరణాల మిస్టరీ
Singer Mangli: అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన శివ చౌహాన్
దేశంలో క్యాన్సర్ మరణ మృదంగం.. దడ పుట్టిస్తున్న ICMR నివేదిక
నాడు “మీసాల పిల్ల” అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్