హైటెక్ సిటీలో అర్ధరాత్రి గందరగోళం.. రోడ్లను దిగ్బంధించి ప్రమాదకరమైన బైక్ విన్యాసాలు

Edited By:

Updated on: Feb 04, 2026 | 9:30 PM

అర్ధరాత్రి దాటిందంటే చాలు.. నగరంలో యువత రెచ్చిపోతున్నారు. రోడ్ల మీద చక్కర్లు కొడుతూ నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నామన్న కనీస విచక్షణ లేకుండా వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఫుల్లుగా తాగి బైకులతో విన్యాసాలు చేస్తూ అదేదో సరదాలాగా శృతి మించి ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల కనిపిస్తున్న ఈ విచిత్ర ధోరణికి అడ్డుకట్ట పడాలనేది పలువురు చెబుతున్న మాట.

హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ పరిధిలో ఈ మధ్య యువత వింత పోకడలకు అలవాటు పడుతున్నారు. రోజంతా ఎలా ఉన్నా రాత్రయితే చాలు ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్లపైనే చక్కర్లు కొడుతూ మిగతా వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ అరాచక ప్రవృత్తి మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ రోడ్లపై కనిపిస్తోంది. ఇటీవలే హైటెక్ సిటీలో ఓ ఆటో డ్రైవర్ సైతం ప్రమాదకర స్టంట్లు చేస్తూ ఏకంగా పోలీసుల వాహనాన్నే అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. పెద్దఎత్తున యువత రోడ్లపైకి చేరిపోయి ఫుల్లుగా మద్యం తాగేసి బైకులతో విన్యాసాలు ప్రదర్శిస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. బైక్ ముందు టైర్‌ను గాల్లోకి లేపుతూ సినిమాల్లో హీరోల్లా ఫీలయిపోతున్నారు. ఇది వారి వయసు రీత్యా సరదాగానే ఉంటున్నప్పటికీ, ఏ మాత్రం అదుపుతప్పినా పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఊహించలేం.. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయనేది నిజం. అయితే.. ఇదంతా పట్టని యువత మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ అదే వారికి ఆనందం అన్నట్లు సరదాలకి పోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్‌!

ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో

పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు

నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us