భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో

Updated on: Apr 10, 2025 | 7:32 PM

సమాజంలో రోజు రోజుకీ భార్యబాధితులు ఎక్కువైపోతున్నారు. భార్యలు పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే మరొకటి ఒడిశాలో జరిగింది. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య వేధింపులు తట్టుకోలేక ఈ చర్యకు పాల్పడుతున్నట్లు తన బాధను వీడియోలో వెల్లడించారు. ఒడిశాలోని ఖుర్దాలో కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

 బాధితుడిని కుంభర్‌బస్తాకు చెందిన రామచంద్ర బర్జెనాగా గుర్తించారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో.. తనపేరు రామచంద్ర బర్జెనా అని, తాను కుంభర్‌బస్తాలో నివసిస్తానని తెలిపాడు. తన భార్య కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించాడు. గత కొన్ని సంవత్సరాలుగా రూపాలి తనను మానసికంగా వేధించడమే కాకుండా.. ఇంట్లో తరచూ గొడవలు పెడుతోందని తీవ్ర భావోద్వేగంతో చెప్పాడు. విడాకులు ఇస్తానని తనను తన కుటుంబాన్ని బెదిరిస్తోందని వెల్లడించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రామచంద్ర రూపాలిని వివాహం చేసుకున్నాడని, వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత రామచంద్ర తల్లిదండ్రులు… రూపాలి, ఆమె కుటుంబం తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారని ఫిర్యాదు చేశారు. తన కోడలు పదేపదే తన పుట్టింటికి వెళ్లేదని, అడ్డు చెబితే తిట్టేదని రామచంద్ర తల్లి ఆరోపించింది. పెళ్లికి అయ్యే మొత్తం ఖర్చుని కూడా తమ కుటుంబమే భరించిందని, రూపాలి కుటుంబానికి రూ. 20 లక్షలు అప్పుగా కూడా ఇచ్చి ఆదుకున్నామని చెప్పింది. వారి పెళ్లి జరిగి రెండేళ్లు మాత్రమే అయిందని, అప్పటి నుంచి తన కొడుకును కోడలు చిత్ర హింసలు పెడుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

మరిన్ని వీడియోల కోసం 

గిన్నిస్‌ రికార్డులకెక్కిన ఎలుక..ఎందుకో తెలిస్తే షాకవుతారు వీడియో

శ్రీశైలంలో 2 చిరుతల సంచారం.. ఆ గేటు కాని లేకపోతే వీడియో

అయ్యో.. ఈ కండక్టర్‌ కష్టాలు ఎవరికీ రాకూడదు..వీడియో

క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయిన విద్యార్థి.. ఏం జరిగిందంటే వీడియో