Honeytrap: నమ్మించి ఇంటికి పిలిచి.. మాట్లాడదామంటూ గదిలోకి తీసుకెళ్లి.. వీడియో తీయించి..!(వీడియో)

Updated on: Oct 06, 2022 | 7:24 PM

సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను మాయలోకి దించి డబ్బులు దండుకుంటోంది ఓ ముఠా. పేరున్న వారిని ఎంపిక చేసుకొని వలపు ఉచ్చులో లాగి.. లక్షల వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను జమ్మూకశ్మీర్‌ పోలీసులు


సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను మాయలోకి దించి డబ్బులు దండుకుంటోంది ఓ ముఠా. పేరున్న వారిని ఎంపిక చేసుకొని వలపు ఉచ్చులో లాగి.. లక్షల వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. గత ఆర్నెల్లలో ఈ ముఠా 40 లక్షల రూపాయల దాకా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసు తెలిపారు. 8 లక్షలు ఇవ్వకపోతే రహస్యంగా తీసిన వీడియో బయటపెడతామని ఓ ముఠా బెదిరిస్తోందని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పక్కా స్కెచ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. భార్యాభర్తలైన శాయిస్తా బషీర్‌, ఐజాజ్‌ అహ్మద్‌ గనీలతోపాటు జహంగీర్‌ అహ్మద్‌ దార్‌ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఆపదలో ఉన్నట్లు శాయిస్తా చేసిన ఫోనుతో వారి ఇంటికి వెళ్లిన అధికారిని మాట్లాడే మిషతో ఆమె పడకగదిలోకి తీసుకువెళ్లింది. లోనికి చొరబడిన ఐజాజ్‌, జహంగీర్‌.. ఆ ఇద్దరినీ కలిపి వీడియో తీశారు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియోను వైరల్‌ చేస్తామని బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Published on: Oct 06, 2022 07:24 PM
Loading...
Unable to load recommendations.
Follow Us