ఏలూరులో వైభవంగా గంగానమ్మ జాతర
ఏలూరులో పడమర వీధి గంగానమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఈ ఉత్సవంలో నగర వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏడేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర సందర్భంగా మూడు నెలలపాటు శుభకార్యాలు వాయిదా వేస్తారు. అమ్మవారు నగర సంచారం చేస్తారని భక్తుల నమ్మకం. ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
ఏలూరులో పడమర వీధి గంగానమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. నగర వీధులు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. సోమవారం ఈ జాతర సందర్భంగా కొర్లబండిపై అమ్మవారి ఊరేగింపును నిర్వహించారు. గంగానమ్మ మూడు నెలలుగా పడమర వీధిలో పూజలు అందుకున్నారు. ఏడేళ్లకు ఒకసారి ఏలూరులో జరిగే ఈ గంగానమ్మ జాతరను ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అనాదిగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. జాతర నిర్వహణ సందర్భంగా మూడు నెలల పాటు ఏలూరు నగరంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.
మరిన్ని వీడియోల కోసం :