Lakshmi statue open eyes: తూర్పుగోదావరిలో వింత ఘటన.. కళ్లు తెరిచిన లక్ష్మీదేవి విగ్రహం.. వైరల్ వీడియో.

|

Nov 27, 2022 | 9:57 AM

తూర్పుగోదావరి జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. కడియం మండలం కడియపులంక చింతలోని ఓ ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచింది.


సాధారణంగా దేవతా విగ్రహాలు కళ్లు మూసి ఉన్నట్లుగాని, సగం మాత్రమే తెరిచి ఉన్న ట్టుగా ఉంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. ఈ క్రమంలో కడియపులంకలోని లక్ష్మీదేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు కళ్ళు తెరిచి ఉండటం అంతరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్త క్షణాల్లో దావానలంలా ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో భక్తులు ఆ వింతను చూడటానికి పోటెత్తారు. కళ్లుతెరిచి దర్శనమిచ్చిన లక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం రోజున ఈ వింత చోటు చేసుకోవడంతో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Follow us on