1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్!

Updated on: Jun 29, 2026 | 9:37 PM

అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ డెట్రాయిట్‌లోని ఈవీ ప్లాంట్‌లో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో 50 కోబోట్స్‌ను నియమించింది. ఈవీ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, చైనా కంపెనీల పోటీ కారణంగా ఖర్చులు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాలపై రోబోల ప్రభావం పెరుగుతోందంటూ కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ జనరల్ మోటార్స్ డెట్రాయిట్‌లోని తన విద్యుత్తు కార్ల తయారీ ప్లాంట్‌లో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో 50 రోబోలను నియమించింది. ఈ రోబోలను ‘కొలాబరేటివ్‌ రోబోస్‌ కోబోస్‌’ అంటున్నారు. ఈవీ కార్ల తయారీ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను జనరల్‌ మోటార్స్‌ సంస్థ ‘ఫ్యాక్టరీ జీరో’గా పిలుస్తోంది. ప్రమాదాలు లేని, కాలుష్యం లేని, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేని విద్యుత్తు కార్లను తయారుచేస్తోంది. అయితే, ఆ కంపెనీ ఊహించిన స్థాయిలో ఈవీలకు గిరాకీ పెరగకపోవడంతో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. దీనికితోడు చైనా నుంచి దిగుమతి అవుతున్న ఎలక్ట్రిక్‌ కార్లతో తీవ్రస్థాయిలో పోటీ పడాల్సిన పరిస్థితి. దీనివల్ల ఈ ప్లాంట్‌పై భారీగా పెట్టుబడులు పెట్టిన జీఎం సంస్థపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవడానికి సంస్థ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో ‘కోబో’లను ప్రవేశపెట్టింది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అమెరికా, కెనడాల్లో కార్ల తయారీ కంపెనీల్లోని కార్మికులకు ప్రాతినిథ్యం వహించే అతి పెద్ద కార్మిక యూనియన్‌ ‘యునైటెడ్‌ ఆటో వర్కర్స్‌’.. ఈ చర్యను కార్మికుల పట్ల నమ్మకద్రోహంగా అభివర్ణించింది. ఈ నిర్ణయం పట్ల తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామని ఆ యూనియన్‌ నేత జేమ్స్‌ కాటన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాల అసెంబ్లింగ్ లో మిగతా ఉద్యోగులతో కలిసి కోబోట్స్ పని చేస్తున్నాయి. మెషిన్లు తమ ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘1000 ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు వారి స్థానంలో రోబోలు వచ్చాయి. ఇదే భవిష్యత్తు అని చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే ప్రజలకు ఉద్యోగాలు ఉండవు’ అని యూనియన్ ప్రతినిధులు వాపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. పండ్ల బాక్స్‌లో ఉన్నది చూసి గుండె గుభేల్‌!

ఇదేం దొంగతనం సామీ.. బంగారంతో పాటు ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..!

లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!

పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్‌.. కట్‌ చేస్తే..

ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట.. భయంతో పరుగులు తీసిన ఇంటి యజమాని

Follow Us