వింత వివాహం.. యూపీ యువతికి పరమశివుడితో పెళ్లి !!

Updated on: Aug 03, 2023 | 9:50 PM

భగవంతుడిని వివాహమాడటం అనేది మానవుల విషయంలో జరగడం అసంభవం. కేవలం దేవీదేవతలకే అది జరుగుతుంది. అయితే భక్తమీరా భగవంతుడినే సర్వస్వంగా భావించి తనని తాను భగవంతుడికి సమర్పించుకుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి శివుడిని వివాహమాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.

భగవంతుడిని వివాహమాడటం అనేది మానవుల విషయంలో జరగడం అసంభవం. కేవలం దేవీదేవతలకే అది జరుగుతుంది. అయితే భక్తమీరా భగవంతుడినే సర్వస్వంగా భావించి తనని తాను భగవంతుడికి సమర్పించుకుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి శివుడిని వివాహమాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. శివుడే తన సర్వస్వంగా నమ్మిన ఆ యువతి తల్లిదండ్రులు, పెద్దల అంగీకారంతో శివుడిని వివాహం చేసుకుంది. ధుమిత్రుల సమక్షంలో, బ్యాండు బాజాల నడుమ పల్లకిలో ఊరేగింపుగా వెళ్లి మరీ యువతి శివుడిని వివాహమాడింది. శివుని విగ్రహానికి పూల మాల వేసి ఆయనకు తనను తాను అర్పించుకుంది. భగవంతుడిపై భక్తితో ఆయన్ను భర్తగా స్వీకరిచించింది. దీంతో ఈ పెళ్లి స్థానికంగా హాట్ టాపిక్‎గా మారింది. ఈ అరుదైన సంఘటన ఝాన్సీ జిల్లాలో జరిగింది. అన్నపూర్ణ కాలనీకి చెందిన ఓ యువతి శివుడిని పెళ్లాడింది. యువతి ఆమె తల్లిదండ్రులు..చాలా కాలంగా బ్రహ్మకుమారి సంస్థలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే యువతి శివుడిపై మమకారాన్ని పెంచుకుంది. ఆయన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కూతురు నిర్ణయానికి ఆమె పేరెంట్స్ కూడా స్వాగతించారు. ఇక తన జీవితాన్ని పరమశివుడికి అంకితం చేయాలని యువతి నిశ్చయించుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్యూటీషియన్లకు ఇక మూడినట్లే .. వీటి వల్ల క్యాన్సర్‌ ముప్పు

ఎలుకను చంపిన వ్యక్తి అరెస్ట్ !! ట్విస్ట్‌ ఏంటంటే ??

Loading...
Unable to load recommendations.
Follow Us