నెటిజన్ల మనసులు గెలుచుకున్న కేంద్ర మాజీ మంత్రి! అమ్మకోసం ఆయన ఏం చేశారో చూడండి!
కేంద్ర మాజీ మంత్రి, జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా తన అనారోగ్యంతో ఉన్న తల్లికి ఆసుపత్రిలో వేణువు ఊదుతూ మనోధైర్యం కల్పించారు. తల్లి మంచం పక్కన కూర్చుని మధురమైన స్వరాలు పలికించగా, ఆమె ముఖంలో చిరునవ్వు విరబూసింది. ఈ హృదయాన్ని హత్తుకునే దృశ్యాన్ని స్వయంగా రికార్డు చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమ్మ ప్రేమే తన బలమని భావోద్వేగ సందేశం రాశారు. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
రాజకీయాల్లో ఎన్నో కీలక పదవులు చేపట్టి, వందలాది మంది ముందు గళం వినిపించిన నాయకుడు.. కన్నతల్లి దగ్గరికి వచ్చేసరికి ఓ సాధారణ కొడుకులా మారిపోయారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లికి మనోధైర్యం కల్పించేందుకు, ఆమె మొఖంలో చిరునవ్వు పూయించేందుకు కేంద్ర మాజీ మంత్రి, జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా వేణువు ఊదారు. ప్రస్తుతం ఆ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి మనసులను హత్తుకుంటోంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న తల్లికి ఒంటరితనం, భయం కలగకుండా ఉండేందుకు అర్జున్ ముండా ఆమె మంచం పక్కనే ప్రశాంతంగా కూర్చున్నారు. తన వెంట తెచ్చుకున్న పిల్లనగ్రోవిని తీసుకుని ఎంతో మధురమైన స్వరాలను పలికించారు. ఆ సుందరమైన వేణుగానం ఆసుపత్రి గదిలో ప్రతిధ్వనిస్తుండగా.. కొడుకు వాయిస్తున్న సంగీతాన్ని ఆస్వాదిస్తూ తల్లి ముఖంలో చిరునవ్వు విరబూసింది. ఆ సన్నివేసాన్ని స్వయంగా రికార్డ్ చేసిన ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోతో పాటు తన తల్లిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ అర్జున్ ముండా భావోద్వేగ సందేశం రాశారు. ‘‘అమ్మ నా జీవితంలో అత్యంత విలువైన ఆశీర్వాదం. ఆమె ప్రేమే నా బలం. ఆమె ఆశీస్సులే నాకు ఎప్పుడూ అండ’’ అంటూ ఆమె పట్ల తన ఉన్నత భావాలను చాటుకున్నారు. జీవితంలో ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నా.. తల్లిదండ్రుల ముందు మనం ఎప్పుడూ చిన్నవారమేనని ఈ ఘటన నిరూపించింది. మాటలతో చెప్పలేని ప్రేమను ఇలాంటి చిన్న అంకితభావాలు, ఆప్యాయతలే వ్యక్తపరుస్తాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేంద్ర ఖజానాకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు!
శభాష్ సీఐ గారు.. కాలుకి సర్జరీ అయినా ఆగని విధి నిర్వహణ
ఇకపై తెలంగాణలో ఇన్స్టంట్ పింఛన్!ఎవరు అర్హులు?ఏ పత్రాలు కావాలి? ఎలా అప్లై చేయాలి?
Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది!
తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదా?..‘జీతం కట్’ అంటోన్న తెలంగాణ సర్కారు