విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్‌ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం

Updated on: Nov 07, 2025 | 4:51 PM

విమానాల్లో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. తోటి ప్రయాణికులతో గొడవలుపడటం.. విమానం డోర్స్‌ ఓపెన్‌ చేయడంలాంటి ఘటనలు నెట్టింట ఎన్నో చూశాం. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. వారణాసి నుంచి ముంబై వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్ విమానంలో ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. విమానం టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు.

అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని, అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో విమానం గంట ఆలస్యంగా బయల్దేరింది. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆకాశ ఎయిర్‌కు చెందిన విమానం సోమవారం సాయంత్రం 6:45 గంటలకు ముంబైకి బయల్దేరాల్సి ఉంది. ప్రయాణికులందరూ విమానంలోకి ప్రవేశించిన తర్వాత, విమానం రన్‌వే వైపు వెళ్తోంది. ఇంతలో విమానంలో ప్రయాణిస్తున్న జౌన్‌పూర్ జిల్లా గౌరా బాద్‌షాపుర్‌కు చెందిన సుజిత్ సింగ్ అనే ప్రయాణికుడు ఉన్నట్టుండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన క్యాబిన్ సిబ్బంది వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించి, విమానాన్ని తిరిగి ఏప్రాన్ వద్దకు తీసుకువచ్చారు. అనంతరం భద్రతా సిబ్బంది విమానంలోకి ప్రవేశించి, ప్రయాణికులందరినీ కిందకు దించారు. సుజిత్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. విచారణలో భాగంగా కేవలం ఆసక్తితోనే ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించానని సుజిత్ సింగ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. భద్రతాపరమైన తనిఖీల అనంతరం, విమానం రాత్రి 7:45 గంటలకు ముంబైకి బయల్దేరింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు

అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే

క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

దేవుడితోనే ఆటలా… హుండీలో బొమ్మ నోట్లు

పాత బ్యాంకు ఖాతాలలో డబ్బు మర్చిపోయారా ?? అయితే ఈ విధంగా చేయండి