పంటపొలాల్లో చేపల సందడి !! పట్టుకునేందుకు ఎగబడిన జనం
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటపొలాలు నీటమునిగాయి. వరద ఉధృతికి చెరువుల్లో ఉండాల్సిన చేపలు పంటపొలాల్లోకి కొట్టుకొస్తున్నాయి. కొత్త నీరు రావడంతో చేపలు ఎదురెళ్తున్నాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు..
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటపొలాలు నీటమునిగాయి. వరద ఉధృతికి చెరువుల్లో ఉండాల్సిన చేపలు పంటపొలాల్లోకి కొట్టుకొస్తున్నాయి. కొత్త నీరు రావడంతో చేపలు ఎదురెళ్తున్నాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. ఎదురు వస్తున్న చెరువులోని చేపలను జనం ఎగబడి పట్టుకుంటున్నారు. అటుగా వెళ్లే వాహనదారులతోపాటు సమీప గ్రామాల ప్రజలు కూడా వరదకు కొట్టుకు వస్తున్న చేపలను పట్టుకుని ఇంటికి తీసుకెళ్తున్నారు. భువనగిరి మండలం మసుకుంట వద్ద మత్స్య కార్మికులు సందడి చేస్తున్నారు. గ్రామ సమీపంలోని వాగు నుంచి వస్తున్న వరదకు భారీ సైజులోని చేపలు కొట్టుకొస్తున్నాయి. వలల ద్వారా చేపలు పడుతున్నారు. చేపలను తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఆటోలను తెచ్చుకున్నారు. అటుగా వెళుతున్న వాహనదారులు కూడా ఆగి ఎగబడుతున్న జనాన్ని చూసి.. వాళ్లు కూడా చేపలు తీసుకొని వెళ్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
“టాడ్‌పోల్ వాటర్”తో అదుపులో బరువు.. వైరల్‌గా మారిన ఆరోగ్య చిట్కా
విమానం క్యూట్‌గా ఉందనా ?? లేక ప్రయాణికులు అందంగా ఉన్నారనా ??