రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి.. అయ్యో.. ఎంత ఘోరం జరిగిందో చూడండి!

Updated on: Jun 28, 2026 | 6:39 PM

బెంగళూరులో హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై చెట్టు కొమ్మ విరిగి పడటంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. తలకు గాయాలై కోమాలోకి వెళ్లిన బాధితుడు చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రమాదాలు ఎప్పుడు, ఏ రూపంలో వస్తాయో చెప్పలేమని.. హెల్మెట్ ప్రాణరక్షక కవచమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

వాహనదారులు చేసే చిన్న నిర్లక్ష్యం ఒక్కోసారి పెను విషాదానికి దారితీస్తుంది. పోలీసులు, అధికారులు ఎంత మొత్తుకున్నా చాలామంది ట్రాఫిక్‌ నిబంధనలు పాటించరు.. ఏముందిలే.. ఈ పక్క వీధిలోకే కదా వెళ్లేది..హెల్మెట్‌ ఎందుకు… అని చాలామంది హెల్మెట్‌ పెట్టుకోకుండా వెళ్తుంటారు. ఏమండీ… ప్రమాదాలు వాహనాలు గుద్దుకుంటేనే రావండీ.. ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చు.. ఆ సమయంలో ఆ హెల్మెట్టే రక్షణ కవచం కావచ్చు.. ఈ వీడియో చూస్తే మీరు దీనిని అంగీకరించక మానరు. ఇటీవల బెంగుళూరులోని రాజాజీనగర్‌లో ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్నాడు. రోడ్డుపై అనేక వాహనాలు వెళ్తున్నాయి. ఈ వ్యక్తి హెల్మెట్‌ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్నాడు. అతను చాలా జాగ్రత్తగా వాహనం నడుపుతూ వెళ్తున్నాడు. అయితేనేం.. చెట్టు కొమ్మ రూపంలో అతన్ని మృత్యువు వెంటాడింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టుకొమ్మ విరిగి.. అటువైపు స్కూటీపై వెళ్తున్న ఆ వ్యక్తి తలపై పడింది. దాంతో అతను అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. కోమాలోకి వెళ్లిపోయాడు. తరువాత ఆసుపత్రిలో చికిత్సను అందించడంతో కోలుకున్నాడు. క్షణాల్లో జరిగిన ప్రమాదం ఎంతటి దారుణానికి దారి తీస్తుందో చూపించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకృతి వైపరీత్యమైనా, సాంకేతిక లోపమైనా, ఎదుటివారి నిర్లక్ష్యమైనా.. ఒక్క క్షణంలోనే జీవితాన్ని తారుమారు చేసేస్తుంది. అందుకే ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరికీ హెల్మెట్ ప్రాణరక్షక కవచంగా మారుతుంది. అయినప్పటికీ చాలా మంది పోలీసులు పట్టుకుంటారనే భయంతో లేదా జరిమానా తప్పించుకోవడానికో హెల్మెట్ ధరిస్తున్నారు. కానీ హెల్మెట్ అసలు ఉద్దేశం ఫైన్ నుంచి తప్పించుకోవడం కాదు.. ప్రాణాలను కాపాడటమే. నిపుణుల సూచనల ప్రకారం నాణ్యమైన ఐఎస్‌ఐ మార్క్ ఉన్న హెల్మెట్‌ను సరిగా ధరించడం వల్ల తలకు తీవ్ర గాయాలు అయ్యే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. చిన్న దూరమైనా, పెద్ద ప్రయాణమైనా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితానికి శాపంగా మారుతుందని మర్చిపోవద్దు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్!

పోలీస్ స్టేషన్‌లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం.. దిమ్మతిరిగే షాకిచ్చిన నెటిజన్లు

రెచ్చిపోయిన ఉప్పల్‌ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రమాదకర స్టంట్స్‌!

ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా భారతీయులు కాదా? పౌరసత్వానికి అసలైన రుజువు ఏంటి?

చైనాకు కౌంటర్‌గా .. భారత్ అతి పెద్ద డ్యామ్‌ నిర్మాణం

Follow Us