Viral: వామ్మో.. ఇదేం ట్విస్టురా బాబూ..! విడాకుల తర్వాత గర్భం.. చివరికి భర్త ఎం చేసాడంటే..?
మనం రకరకాల కేసులు చూస్తూ ఉంటాం. ఇది మాత్రం దిమ్మ తిరిగే కేసు. ఇందులో ట్విస్ట్ మామూలుగా లేదు. అసలు అలా ఎందుకు జరిగిందన్నది తేలాల్సిన అంశం. వాళ్లిద్దరూ భార్యాభర్తలు. పెళ్లి తర్వాత పిల్లలు కలగలేదు.
మనం రకరకాల కేసులు చూస్తూ ఉంటాం. ఇది మాత్రం దిమ్మ తిరిగే కేసు. ఇందులో ట్విస్ట్ మామూలుగా లేదు. అసలు అలా ఎందుకు జరిగిందన్నది తేలాల్సిన అంశం. వాళ్లిద్దరూ భార్యాభర్తలు. పెళ్లి తర్వాత పిల్లలు కలగలేదు. పదేళ్లుగా ఎంత ప్రయత్నించినా ఆ అదృష్టం దక్కలేదు. దాంతో.. విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. తీసేసుకున్నారు. ఇప్పుడు ఆమె గర్భం దాల్చింది. అందుకు కారణం అతనే అంటోంది ఆమె. అతనేమో తనకు ఎలాంటి సంబంధమూ లేదంటున్నాడు. గుజరాత్‌లో వెలుగు చూసిందీ ఘటన. వడోదరకు చెందిన బాధితురాలు అభయం హెల్ప్‌లైన్ నంబర్ 181కి కాల్ చేసింది. ఈ విషయంలో తనకు సాయం చెయ్యాలని కోరింది. విడాకుల తర్వాత ఆమె భర్త ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ అతను ఆమెను వదల్లేదు. తరచుగా ఆమె దగ్గరకు వెళ్తూనే ఉన్నాడు. ఆమెతో ఫిజికల్ కాంటాక్ట్ కొనసాగించాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 21న తాను ప్రెగ్నెంట్ అయినట్లు అతనికి విషయం చెప్పింది. మండిపడిన అతను.. తనకు సంబంధం లేదన్నాడు. ఆ బిడ్డకు తాను తండ్రిని కాదన్నాడు. అతన్ని ఎంత బతిమలాడినా ఒప్పుకోకపోవడంతో.. ఆమె హెల్ప్‌లైన్ సాయం కోరింది. అభయం టీమ్.. వాళ్లిద్దర్నీ కలిపేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అతను మొండికేశాడు. విడాకులు తీసేసుకున్నాం కాబట్టి.. తనకు ఏ బాధ్యతా లేదంటున్నాడు. చివరకు అభయం టీమ్.. ఆమెను… కర్జాన్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి.. అక్కడ పంచాయతీ పెట్టింది. వాళ్లు విడాకులు తీసుకున్నది బిడ్డ పుట్టట్లేదనే కదా…. మరి విడాకుల తర్వాత బిడ్డ పుడుతుందని తెలిసినప్పుడు.. తిరిగి కలిసిపోవచ్చు కదా… ఎందుకిదంతా… ఇదే పోలీసుల్నీ, అభయం టీమ్‌నీ ఆశ్చర్యపరిచింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!