Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

Updated on: Nov 18, 2022 | 9:27 AM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ కుక్క .. పిల్లి పిల్లని


తాజాగా ఓ కుక్క .. పిల్లి పిల్లని కాపాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఒక పిల్లి పిల్ల ఒక నీటి ప్రవాహం మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడ ఓ బండరాయిపై నిలబడి బిక్కుబిక్కుమంటూ కనిపించింది. అంతలోనే అటుగా వచ్చిన ఒక కుక్క పిల్లిని చూసింది. ఎలాగైనా దాన్ని కాపాడాలనుకుంది. పిల్లిని కాపాడేందుకు ఆ కుక్క వేగంగా వెళ్లి ఓ చెక్కను నోట కరుచుకుని తీసుకొచ్చింది. నీటి ప్రవాహానికి అడ్డుగా వేసింది. పిల్లి కాళ్ల దగ్గర నుంచి ఆ చెక్కను వంతెనలా వేసింది. దాంతో ఆ పిల్లి చెక్కపై నుంచి చక్కగా నడుచుకుంటూ ఇవతలి ఒడ్డుకు చేరింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కుక్క చేసిన ఈ పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. రకరకాల ఫన్నీ కామెంట్స్‌ కురిపిస్తున్నారు. కొందరు మాత్రం లైకుల కోసం కావాలనే ఇలాంటి వీడియోలు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. లైకుల కోసం పిల్లిని ఇలా హింసించటం తప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇలాంటి వీడియోలు చూడమని ప్రజలను ప్రోత్సహించవద్దంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tattoo for Govt Job: పచ్చబొట్టు ఉంటే కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం కట్..! ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువకుడు..

Woman – daughter: అమానుషం.. తన ప్రియుడితో కుమార్తెకు పెళ్లి చేయించిన తల్లి..! బిడ్డను కాపాడుకోవాల్సిన త‌ల్లే ఇలా..

Hognose snake: పాముల ప్రపంచానికి డ్రామా రాణి.. ఈ పాము వేషాలు మామూలుగా లేవుగా.. చ‌నిపోయిన‌ట్లు న‌టించి..

Published on: Nov 18, 2022 09:27 AM
Loading...
Unable to load recommendations.
Follow Us