Viral Video: వీడి పైత్యం తగలెయ్య.! నడిరోడ్డుపై శవం.. షాక్‌ లో స్థానికులు.!

|

Sep 23, 2024 | 8:20 AM

సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్‌ అయిపోవాలని కొంద‌రు చేస్తున్న వింత‌ ప‌నులు అంద‌రినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఉత్తర‌ప్రదేశ్‌లో ఓ యువ‌కుడి ఇన్‌స్టా రీల్స్ పిచ్చి పీక్స్‌కి వెళ్లింది. ఈ క్రమంలో అతను న‌డిరోడ్డుపై శ‌వంలా ప‌డుకున్నాడు. అత‌ని స్నేహితులు దాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టాల‌నేది వారి ఐడియా. కానీ, చివ‌రికి వారు క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లాల్సి వ‌చ్చింది. యూపీలోని కస్‌గంజ్‌ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

సోషల్‌ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి 23 ఏళ్ల ముఖేశ్‌ కుమార్‌ నడిరోడ్డుపై శవంలా పడుకున్నాడు. ఎర్రటి చాపపై యువకుడు పడుకుని ఉండగా, మెడలో దండ వేసి ఒంటిపై తెల్లటి గుడ్డ కప్పారు అతని స్నేహితులు. అంతేకాదు, అతని ముక్కులో దూది కూడా పెట్టారు. అచ్చం శవంలా నడిరోడ్డుపై ఉంచిన అతని స్నేహితులు ఇన్‌స్టాలో రీల్‌ కోసం దానిని వీడియో తీయడం ప్రారంభించారు. వీడియో తీయడం పూర్తికాగానే ముఖేష్‌ పగలబడి నవ్వుతూ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దాంతో అప్పటివ‌ర‌కు నిజంగా యువ‌కుడు చ‌నిపోయాడ‌ని సానుభూతితో నిలబడి చూస్తున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. మరోవైపు ఈ ఘ‌ట‌న కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ముకేశ్‌ కుమార్‌, అత‌ని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై నెట్టింట‌ పలువురు విమర్శలతో విరుచుకుపడ్డారు. వ్యూస్, లైక్‌ల కోసం ఇలాంటి పిచ్చి ప‌నులేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్స్‌కోసం ఇంతగా దిగజారాలా అని కొందరు, ప్రపంచం అంతా విచిత్రమైన వెర్రివాళ్లతో నిండిపోయిందని, వాళ్లకు మంచి రీల్స్‌ చేయడానికి శిక్షణ ఇవ్వాలని కొందరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.