Dangerous stunt Video: వామ్మో.. తాడుపై డేంజరస్ స్టంట్లు.. అదీ వేల అడుగుల ఎత్తులో.. మీ కాళ్ళని మీరే నమ్మలేరు..(వీడియో)

|

Mar 10, 2022 | 12:35 PM

Dangerous stunt: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా స్టంట్ వీడియోలు, విన్యాసాలు నెటిజన్లను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. మొబైల్ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యాక... స్టంట్ వీడియోల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రోజూ ఇలాంటివి ఎన్నో నెట్టింట...


సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా స్టంట్ వీడియోలు, విన్యాసాలు నెటిజన్లను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. మొబైల్ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యాక… స్టంట్ వీడియోల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రోజూ ఇలాంటివి ఎన్నో నెట్టింట సందడి చేస్తున్నాయి. ఐతే… వాటిలో ఈ వీడియో మాత్రం ప్రత్యేకమైనదని చెప్పక తప్పదు. ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండరు. నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ రోప్ స్టంట్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్ చేశారు. ఇందులో వేల అడుగుల ఎత్తులో ఓ వ్యక్తి తాడుపై స్టంట్ చేస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తేనే భయమేస్తుంది.ఎత్తైన రెండు కొండల మధ్య తాడు కట్టి ఉంది. ఆ తాడుపై అతను నడుస్తున్నాడు. మధ్యలో ఆ తాడుని కాళ్లతోనే బ్యాలెన్స్‌ చేస్తూ గిరగిరా తిరుగుతున్నాడు. జనరల్ గా ఇలా నడిచేవారు బ్యాలెన్స్ కోసం ఉపయోగించే కర్ర కూడా అతను ఉపయోగించలేదు. అక్కడ గాలి వేగం కూడా చాలా ఎక్కువ. అలాంటిచోట అతను చాలా ప్రమాదకరమైన విన్యాసాలు చేశాడు. అన్ని చేసినా అతను తాడు నుంచి పడిపోవకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వీడియో చివర్లో ఆ వ్యక్తి తాడుపై నిలబడి తనను చూసిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల మనసు దోచుకుంటుంది. లక్షలమంది వీక్షకులు ఈ వీడియోను వీక్షిస్తున్నారు. వేలల్లో లైకులతో హోరెత్తిస్తున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “నేను చూస్తున్నది నిజమేనా అని నమ్మలేకపోతున్నాను” అని ఒకరు కామెంట్ ఇవ్వగా… “హై వోల్టేజ్” అని మరొకరు కామెంట్ ఇచ్చారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..