Tirumala: డియర్ పేరెంట్స్.! చూడండి.. మీ పిల్లలు ఎలా తయారయ్యారు.!
తిరుమల ఘాట్ రోడ్డు లో యువకుల హంగామా వాహనదారులను ఇబ్బందులకు గురి చేసింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ లో వాహనం పై కెక్కి కేరింతలు కొట్టిన యువకులు విన్యాసాలు చేశారు. ఒకవైపు వర్షం కురుస్తుండగా ఘాట్ రోడ్ లో ప్రమాదకర ప్రయాణం సాగించారు.తెలంగాణ కు చెందిన TS 08 JZ 6003 వాహనం రూఫ్ టాప్ ఓపెన్ చేసి కారు 4 డోర్లు తీసి వేలాడుతూ కేకలు వేస్తూ ప్రయాణం సాగించారు. యువకుల ఉత్సాహం ఘాట్ రోడ్డులో వెళ్లే ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించాయి.
తిరుమల ఘాట్ రోడ్డు లో యువకుల హంగామా వాహనదారులను ఇబ్బందులకు గురి చేసింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ లో వాహనం పై కెక్కి కేరింతలు కొట్టిన యువకులు విన్యాసాలు చేశారు. ఒకవైపు వర్షం కురుస్తుండగా ఘాట్ రోడ్ లో ప్రమాదకర ప్రయాణం సాగించారు. తెలంగాణ కు చెందిన TS 08 JZ 6003 వాహనం రూఫ్ టాప్ ఓపెన్ చేసి కారు 4 డోర్లు తీసి వేలాడుతూ కేకలు వేస్తూ ప్రయాణం సాగించారు. యువకుల ఉత్సాహం ఘాట్ రోడ్డులో వెళ్లే ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించాయి. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండగా రాకపోకలకు అంతరాయం కలిగించేలా యువకులు హల్ చల్ చేశారు. ఈ వ్యవహారం టిటిడి దృష్టికి వెళ్లడంతో విజిలెన్స్ సిబ్బంది ఆరా తీశారు. తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదకరంగా సెల్ఫీలు తీసుకున్న యువకులపై చర్యలు తీసుకున్నారు. రెండో ఘాట్ రోడ్డులో కారు రూఫ్ టాప్, డోర్స్ కు వేలాడుతూ సెల్ఫీ లు తీసుకున్న యువకులను గుర్తించారు. వాహనదారులను ఇబ్బందులకు గురి చేసిన ఆరుగురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నందకం గెస్ట్ హౌస్ వద్ద యువకుల వాహనాన్ని గుర్తించిన టిటిడి విజిలెన్స్ సిబ్బంది తిరుమల 2 టౌన్ పోలీసులకు అప్పగించారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదకర విన్యాసాలు చేయకూడదని, అతివేగం ధార్మిక క్షేత్రం లో విచ్చలవిడిగా ప్రవర్తించడం పద్ధతి కాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించడంతో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.