Dangerous driving: డేంజరస్ డ్రైవింగ్.. కారు వేగానికి అడుగుల ఎత్తుకు ఎగిరిందిగా.. చూస్తే మైండ్ బ్లాంకే..
ప్రస్తుతం ఒక షాకింగ్ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదుపుతప్పి వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది.
ప్రస్తుతం ఒక షాకింగ్ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదుపుతప్పి వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జూలై 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.ఈ షాకింగ్ ఆక్సిడెంట్ ఘటన ధర్మశాలలోని బాడోల్ గ్రామ సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు పక్కన ఓ కారు పార్క్ చేసి ఉంది. అదే రోడ్డులో ఒక పికప్ వ్యాన్ అటుగా వెళ్తోంది. ఇంతలో దానికి ఎదురుగా ఓ ఎరుపురంగు కారు వేగంగా దూసుకొస్తోంది. ఈ పికప్ వ్యాన్‌ను తప్పించబోయి అదుపుతప్పి వ్యాన్‌ను ఢీకొట్టింది. ఆ వేగానికి పికప్ వ్యాన్ కొన్ని అడుగుల ఎత్తుకు ఎగిరి అక్కడే పార్క్ చేసిన ఉన్న తెల్ల కారుపై పడింది. వీడియో చూస్తే ఈ ప్రమాదం జరిగిన రోడ్డుపై కాసేపటి క్రితంమే భారీ వర్షం కురిసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే రోడ్డు మొత్తం తడిగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. కాస్త లేటయినా పర్లేదు గురూ కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయండి…అది మీకు, మీ పక్కవారికి కూడా శ్రేయస్కరం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..