విశాఖ జిల్లాలో అమానవీయ ఘటన..! ముళ్ళపొదల్లో ఏడుస్తూ పసిపాప(వీడియో): Baby Rescue Video.

|

Sep 05, 2021 | 7:52 PM

అమ్మవడిలో హాయిగా ఉండాల్సిన ఓ పసికందు ముళ్ళపొదల్లో అల్లాడిపోతున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. కాకులు దూరని కారడవిలో.. ఓ వైపు చల్లని గాలులు.. మరోవైపు ఏకదాటిగా కురుస్తున్న వర్షం..

అమ్మవడిలో హాయిగా ఉండాల్సిన ఓ పసికందు ముళ్ళపొదల్లో అల్లాడిపోతున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. కాకులు దూరని కారడవిలో.. ఓ వైపు చల్లని గాలులు.. మరోవైపు ఏకదాటిగా కురుస్తున్న వర్షం.. వీటికి తోడు పాపపై చీమలు చేస్తున్న దాడి. ఊహించుకునేందుకే భయంకరంగా ఉన్న ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.

రోలుగుంట మండలం భోగాపురంలో సమీపంలోని బీఎన్ రోడ్డులో అప్పుడే పుట్టిన పసికందును ముళ్ళపొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్ళారు.పసిబిడ్డ పొదల్లో ఉందన్న సమాచారం అందుకున్న ఎస్సై నాగకార్తీక్.. వెంటనే స్పందించి శిశువును స్వయంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ శిశువు మహిళా శిశుసంక్షేమ శాఖాధికారుల ఆధీనంలో ఉంది. ఆడశిశువు కావడంతోనే వద్దనుకుని పొదల్లో విడిచివెళ్ళినట్టు అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. సకాలంలో స్పందించి శిశువును ఆసుపత్రికి చేర్చిన ఎస్సైని స్థానికులు అభినందించారు.
YouTube video player
మరిన్ని ఇక్కడ చూడండి: Afghanistan Leader:ఆఫ్గాన్‌లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం..!సుప్రీం లీడర్‌గా అఖుంద్‌జాదా(వీడియో).

Tailor Roja: టైలర్‌గా మారిన రోజా.! యూనిఫామ్‌ కుట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన నగరి ఎమ్మెల్యే..(వీడియో).

 World Skyscraper Day: స్కైస్క్రాపర్స్‌ డే స్పెషల్.. ఆకాశాన్ని తాకే అద్భుతాలు..! ఎవరు కట్టారో తెలుసా..!(వీడియో)

Thalaivii Pre-Release Event: దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ తలైవి ప్రీ రిలీజ్ ఈవెంట్.. (లైవ్ వీడియో).