Viral Video: గోల్ఫిస్టిక్‌ను ఈజీగా విరిచేసిన పీత !! నెట్టింట వీడియో వైరల్

|

Jan 21, 2022 | 9:21 AM

సముద్ర ప్రాంతాలలో తిరిగే పీతల కంటే కొన్ని పీతల శరీరం చాలా పెద్దగా ఉంటుంది. చూసేందుకు భయంకరంగా ఉంటుంది. అలాంటి పీతను రాకాసిపీతలని పిలుస్తుంటారు.

సముద్ర ప్రాంతాలలో తిరిగే పీతల కంటే కొన్ని పీతల శరీరం చాలా పెద్దగా ఉంటుంది. చూసేందుకు భయంకరంగా ఉంటుంది. అలాంటి పీతను రాకాసిపీతలని పిలుస్తుంటారు. ఈ రకమైన పీతలో మైదాన ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. ఈ బలమైన పీతలు ఆస్ట్రేలియా దీవుల్లో ఎక్కువ సంఖ్యలో నివసిస్తుంటాయి. అయితే తాజాగా ఓ పీత స్టామినా చూసి, బిత్తిరైండు ఓ వ్యక్తి. ఇక క్రిస్మస్‌ దీవుల్లో రాకాసి పీతల అధికంగా నివసిస్తుంటాయి. ఈ దీవులకు చెందిన పాల్‌ అనే వ్యక్తికి ఒక పెద్ద పీత కంటపడింది. ఆయన అతి పెద్ద పీతను గోల్ఫ్‌ క్లబ్‌తో చివరన పట్టుకున్నాడు. ఐరన్‌తో తయారు చేసిన బలమైన గోల్ఫ్‌ స్టిక్‌లను సైతం పీత విరిచేసిందంటే దానికి ఎంత బలం ఉంటుందో అర్థమైపోతుంది.