Couple love making: తాంత్రికుడి ముందు శృంగారం చేసిన జంట.. వారు ఆ పనిలో ఉండగా ఊహించని సీన్..! చివరికి..

Updated on: Nov 28, 2022 | 9:58 AM

రాజస్థాన్‌లో విచిత్ర సంఘటన జరిగింది. రాహుల్, సోనూ అనే ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ భదవిగూడలోని భావ్‌జీ మందిర్‌లో ఉన్న తాంత్రికుడిని వారి కుటుంబాలతో అప్పుడప్పుడూ సందర్శించేవారు.


రాజస్థాన్‌లో విచిత్ర సంఘటన జరిగింది. రాహుల్, సోనూ అనే ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ భదవిగూడలోని భావ్‌జీ మందిర్‌లో ఉన్న తాంత్రికుడిని వారి కుటుంబాలతో అప్పుడప్పుడూ సందర్శించేవారు. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారడంతో రాహుల్, అతడి భార్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో రాహుల్ భార్య తాంత్రికుడైన భలేష్ కుమార్‌ను సాయం కోరింది. గత ఏడెనిమిదేళ్లుగా స్థానికంగా నివసిస్తున్న భలేష్ కుమార్.. అక్కడున్న ప్రజలకు తానొక తాంత్రికుడని నమ్మించి.. వారికి తాయత్తులు ఇచ్చేవాడు. అలాగే రాహుల్ భార్యతో కూడా సన్నిహితంగా మెలుగుతూ.. భర్త రహస్యంగా సాగిస్తోన్న అక్రమ సంబంధాన్ని ఆమెవద్ద బట్టబయలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్.. అతడ్ని బెదిరించసాగాడు. ఈ క్రమంలో తన పరువు పోతుందన్న భయంతో సదరు తాంత్రికుడు రాహుల్, సోనూలను హత్యకు స్కెచ్ వేశాడు. అందులో భాగంగానే దాదాపు 50 ట్యూబ్‌ల ఫెవిక్విక్‌ కొనుగోలు చేసి బాటిల్‌లో నింపిన భలేష్ కుమార్‌.. ఆ తర్వాత పధకం ప్రకారం..

రాహుల్, సోనూలను అటవీ ప్రాంతానికి రావాలని పిలిచాడు. అక్కడికి చేరుకున్న వారిని తన ఎదుట శృంగారంలో పాల్గొనాల్సిందిగా కోరాడు. ఇక ఆ ఇద్దరూ ఆ పనిలో ఉండగా తాంత్రికుడు ఫెవిక్విక్‌ను వారిపై పోశాడు. దీంతో రాహుల్, సోను చాలాసేపు ఒకరికొకరు అతుక్కుపోయారని..విడిపించుకోడానికి ప్రయత్నించినప్పుడు రాహుల్ ప్రైవేట్ పార్ట్ అతడి శరీరం నుంచి వేరు చేయబడటమే కాకుండా.. సోనూ శరీరానికి కూడా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రాహుల్, సోనూ అభ్యంతరకరమైన స్థితిలో ఉండగా భలేష్ కుమార్.. వారిని హతమార్చి అక్కడ నుంచి పారిపోయాడు. కాగా, మృతదేహాలు లభ్యమైన అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న 50 సీసీ కెమెరాల ఫుటేజీని స్కాన్ చేసి, సుమారు 200 మందిని విచారించిన అనంతరం.. ఈ హత్యల వెనుక భలేష్ కుమార్ హస్తం ఉందని పోలీసులు అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యలు తానే చేసినట్లు అంగీకరించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్‌ గోల్డ్‌ అంటున్న నెటిజనం..

Massage for Minister: తీహార్‌ జైలు కొత్త ట్విస్ట్‌.. మంత్రి సత్యేంద్రకు మసాజ్‌ చేసింది అతడే వ్యక్తి..! వీడియో

 

Loading...
Unable to load recommendations.
Follow Us