Cooking with JCB జేసీబీలతో వంటచేస్తూ.. కాంక్రీట్‌ మిక్సర్‌తో పిండి కలపటం ఎప్పుడైనా చూశారా..? వీడియో.

|

Feb 11, 2023 | 8:57 AM

ఇటీవలి కాలంలో తవ్వకాల కోసం జేసీబీలను వాడుతున్నారు. దీంతో పని సులువుగా పూర్తవుతుంది. అలాంటిదే ఇక్కడ జేసిబీతో వంటలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మధ్యప్రదేశ్‌లోని బిజయరామ్ ధామ్ రఘునాథ్ ఆలయంలో ప్రతి సంవత్సరం సనాతన ధర్మ మహా సమాగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో భక్తులందరికీ సరిపోయేలా భారీగానే ప్రసాదాలు తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జాతర సందర్భంగా అవసరమైన వంటకాలు చేసేందుకు ఏకంగా జేసీబీని ఉపయోగించారు. అంతేకాదు, కాంక్రీట్‌ మిక్సర్ యంత్రాన్ని మల్పువానా పిండిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కాకుండా పిండి రుబ్బడానికి, కలపడానికి కూడా ఇటువంటి యంత్రాలనే ఉపయోగిస్తారు. ఈ వంటకాలన్నీ తయారు చేసేందుకు 500 కంటే ఎక్కువ కండాయ్‌లు వాడుతున్నారు. ఈ కార్యక్రమం 100 ఎకరాల మైదాన ప్రదేశంలో జరుగుతుంది. ప్రతిరోజు లక్ష మందికి పైగా ఇక్కడ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వంటకాలను సిద్ధం చేయడానికి 40కి పైగా ఫర్నేస్‌లను సిద్ధం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 11, 2023 08:52 AM